మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను యావత్తు దేశం కొనియాడింది. గౌరవించింది. పార్టీలకు అతీతంగా ఆయనకు గౌరవం దక్కింది. కారణం ….గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్ధిక మంత్రిగా నియమితులై ఆర్ధికంగా క్లిష్ట దశలో ఉన్న దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రపంచంలో ఇండియా సగర్వంగా తలెత్తుకునేలా చేశారు.
అంతే కాకుండా పదేళ్లు ప్రధానిగా పని చేశారు. ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సమాజం ఆయనను అపరిమితంగా గౌరవించడానికి కారణం …తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం సోనియా గాంధీది అయినప్పటికీ అది సాకారం కావడానికి ప్రధానిగా మన్మోహన్ కృషి అపారం. అందుకే ఆయన పేరును తెలంగాణలో శాశ్వతం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మాజీ ప్రధానికి ఘనంగా నివాళులర్పించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలోనే హైదరాబాదుతోపాటు ప్రతి జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని విగ్రహాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలని ప్రతిపక్ష నేత హరీష్ రావు కోరారు. ఇంతే కాకుండా ఏదైనా ఒక పథకానికి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ జరిగితే తెలంగాణలో ఆయన పేరు శాశ్వతమవుతుంది.
andhra lo vaadi perukooda vinbadadu