రేష‌న్ బియ్యం మిస్సింగ్ కేసు.. ఏ6గా పేర్ని నాని!

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి వైసీపీ నుండి గ‌ట్టిగా వాయిస్ వినిపిస్తున్న పేర్నినానిని కేసులు చుట్టుకుంటున్నాయి.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి వైసీపీ నుండి గ‌ట్టిగా వాయిస్ వినిపిస్తున్న పేర్నినానిని కేసులు చుట్టుకుంటున్నాయి. తాజాగా త‌న భార్య జ‌య‌సుధ పేరు మీద ఉన్న‌ గోడౌన్‌లో రేష‌న్ బియ్యం మాయం చేశార‌నే కేసులో మాజీ మంత్రి పేర్నినానిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆయ‌న్ను ఏ6గా చేరుస్తూ బంద‌రు తాలుకా పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

ఇప్ప‌టికే ఇదే కేసులో సివిల్ స‌ప్ల‌యిల్ అసిస్టెంట్ మేనేజ‌ర్ కోటిరెడ్డి, గోడౌన్ మేనేజ‌ర్ మాన‌స తేజాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. బియ్యం మాయం కావ‌డం వెనుక ప్ర‌భుత్వ ఉద్యోగి కోటిరెడ్డి ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే త‌న‌పై అనుమానం రాకుండా ముందుగానే కోటిరెడ్డి ఫిర్యాదు చేసిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఇదే కేసులో రైస్ మిల్ల‌ర్ బొర్రా ఆంజ‌నేయులు, లారీ డ్రైవ‌ర్ బొట్ల మంగారావుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయ‌మూర్తి ముందు ప్ర‌వేశ పెట్టగా వారికి 12 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిల్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ఈ కేసుపై పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ అద్దె కోస‌మే గోడౌన్ క‌ట్టుకున్నామ‌ని.. అక్ర‌మాల కోసం కాద‌న్నారు. త‌న భార్య పేరు మీద ఉన్న గోడౌన్‌లో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు రేష‌న్ బియ్యాన్ని నిల్వ ఉంచార‌ని.. అయితే సాంకేతికంగా త‌మ త‌ప్పు లేక‌పోయినా, నైతిక బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌న‌పై ప్ర‌తీకారం తీర్చుకోడానికి త‌న ఇంట్లో ఆడవాళ్ల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని ఆవేద‌న చెందిన విష‌యం తెలిసిందే. ఇవాళ పేర్నినానిపై కూడా కేసు న‌మోదు కావ‌డంతో కేసు ఏ విధంగా ముందుకు పోతుందనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చనీయ‌శంగా మారింది.

3 Replies to “రేష‌న్ బియ్యం మిస్సింగ్ కేసు.. ఏ6గా పేర్ని నాని!”

  1. తాడేపల్లి ప్యాలస్ కి వెళ్లి వుంటారు ఆ బియ్య.ము.

    ప్రజల డబ్బు తో ఫ్రీ గా ఆదాయం అంటే ఆన్న కి మహా ప్రీతి. ఒకే రోజులో లక్ష ఎగ్ పఫ్ లు తిన్న ఘనత అన్నది.

  2. దొరికిన బియ్యం దొ0గ

    పందికొక్కు మాదిరి బియ్యం దె0గితిని, దొరికిన బియ్యం దొ0గ, ఇంకా నువ్వే మాట్లాడ్డం ఏంట్రా తొర్రి లాంజీ కొ’డకా.. ఇప్పుడు కుటుంభ సమేతంగా ఇద్దరినీ దె0గుతారు లోపలేసి..

    1. ನೀ ಅಮ್ಮನಿ ಮನೀಷಿ ದೆಂಗಿದೆ ಪುಟ್ಟವ ಲೆಕ್ಕ ಪಂಡಿ ದೆಂಗಿದೆ ಪುಟ್ಟವ ನೀನು. ಅಸ್ಸಾಲು ನೀ ನನ್ನ ಎವದೋ ನೀನು ತೇಲುಸಾ. ನೀ ಅಮ್ಮನಿ ಅಡಗರ ಲಂಜ ಕೊಡಕ

Comments are closed.