కేఏ పాల్ తెలుసు కదా. ఆయన్ని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. చాలా పాపులర్ వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియనివారు ఉంటారేమోగాని కేఏ పాల్ అంటే తెలియనివారెవ్వరూ తెలుగు రాష్ట్రాల్లో లేరు…ఉండరు. ఆయన్ని క్రైస్తవ మత ప్రచారకుడు అనాలా? రాజకీయ నాయకుడు అనాలా? కామెడీ కింగ్ అనాలా? తెలియదు. ఆయన్ని మత ప్రచారకుడిగా ఎంతమందికి తెలుసో తెలియదుగాని, కామెడీ కింగ్గా చాలామందికి తెలుసు.
ఒక్కసారి యూట్యూబ్లోకి వెళితే కేఏ పాల్ ఇంటర్వ్యూలు, ఆయన కామెడీగా మాట్లాడిన వీడియోలు కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి. ఆయన ప్రత్యేకంగా పనిగట్టుకొని కామెడీగా మాట్లాడడు. ఆయన అర్థంపర్థం లేకుండా మాట్లాడే మాటల్లోనే, మాట్లాడే తీరులోనే, హావభావాల్లోనే బోలెడంత హాస్యం పుడుతుంది. ఇంతలా నవ్వించే కేఏ పాల్ తాజాగా మరో బ్రహ్మాండమైన జోక్ పేల్చాడు. ఏమిటా జోక్ అంటారా? ప్రస్తుతం ఉన్న పార్టీలు దేశాన్ని, రాష్ట్రాన్ని (ఆయన మాట్లాడింది తెలంగాణలో కాబట్టి ఆ రాష్ట్రమే కావొచ్చు) అప్పుల పాలు చేసి నాశనం చేశాయన్నాడు.
అందుకే తాను ప్రజాశాంతి పార్టీ పెట్టానని, తాను అధికారంలోకి వస్తే అప్పులు తీరుతాయని, అభివృద్ధి జరుగుతుందని చెప్పాడు. అందుకే బడుగు బలహీనవర్గాల వారంతా కలిసి తనను ప్రధానమంత్రిగా గాని, ముఖ్యమంత్రిగా గాని చేయాలన్నాడు. అలా చేస్తే అప్పులు తీరుతాయని, అభివృద్ధి జరుగుతుందని అన్నాడు. నరేంద్ర మోడీ గుజరాత్‌కే ప్రధానమంత్రి అని మిగిలిన రాష్ట్రాలకు కాదని విమర్శించాడు. రన్ ఫర్ జీసస్ ర్యాలీలో మాట్లాడిన కేఏ పాల్ తనను వెంటనే ఏదో ఒకటి చేయండని వేడుకున్నాడు.
2022లో ఏపీలో ఇలాగే మాట్లాడాడు. అప్పుడు అక్కడ వైఎస్ సీఎంగా ఉన్నాడు. తొందరలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారి పెను ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని కేఏ పాల్ చెప్పాడు. అప్పడాయన ‘జగన్ పోవాలి…-పాల్ రావాలి’ అనే నినాదంతో యాత్ర చేశాడు. ఈ సందర్భంగానే పాల్ మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించుకోకపోతే రాష్ట్రాన్ని కూడా రక్షించుకోలేమని అన్నాడు. ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పుల కారణంగా మరో ఏపీ శ్రీలంకలా మారడం ఖాయమని జోస్యం చెప్పారు.
జగన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదన్న పాల్.. తనపై ఉన్న కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమీ అడగలేకపోతున్నాడని విమర్శించాడు. దేశంలో అవినీతి దారుణంగా పేరుకుపోయిందని, తనను ప్రధానిని చేస్తే దేశానికి మరమ్మతులు చేస్తానని అన్నాడు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రిని అవుతానని కూడా చెప్పాడు. మొత్తంమీద పాల్కు ముఖ్యమంత్రో, ప్రధాన మంత్రో కావాలనే కోరిక ఇంకా రగులుతూనే ఉందన్నమాట.
జగన్ కంటే పాల్ చాలా నయం.
కొంత మంది ప్రతి పక్ష నేత ల కంటే….k a paul చాలా better
“శాంతి” కోసమైనా విజయసాయి రెడ్డి గారు(డు) “ప్రజాశాంతి” పార్టీ లో చేరడానికి ప్రజలు కోరుకోవాలి. ఆ(డి)యన స్టేట్మెంట్ పరమార్థం ఇదేనేమో !!
Jagan 2.0 on fire ..