సైలంట్ కిల్లర్-రోషన్

రోషన్ లుక్స్, ఈజ్ అన్నీ చూస్తుంటే టాలీవుడ్ లో ఓ మంచి యంగ్ హీరోగా స్ధిరపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి.

సాధారణంగా వారసులు ఎంట్రీ ఇస్తుంటే ఒక రేంజ్ హడావుడి వుంటుంది. తమ కొడుకు కోసం తండ్రి తన పలుకుబడి, డబ్బు వాడి తమ వారసులను ప్రమోట్ చేయాలని, సినిమాలు చేయించాలని ప్లాన్ ల మీద ప్లాన్ లు చేస్తారు. కానీ నటుడు, సీనియర్ హీరో శ్రీకాంత్ రూటు వేరు. అతగాడి వారసుడు రోషన్ రూటు వేరు.

రోషన్ చాలా ఎర్లీ ఏజ్ లోనే ఓ సినిమా చేసాడు. టూ ఎర్లీ ఎంట్రీ కావడంతో పెద్దగా క్లిక్ కాలేదు. కోర్ట్ మాదిరిగా అదే సినిమా ఇప్పుడు వచ్చి వుంటే వేరేగా వుండేదేమో?

పెళ్లిసందడి టైటిల్ తో రాఘవేంద్రరావు మరో సినిమా తీసినపుడు రోషన్ ఎంట్రీ ఇచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. శ్రీలీల, డ్యాన్స్ లు, పాటలతో పాటు రోషల్ లుక్స్, ఈజ్, డ్యాన్స్ లు కూడా ఈ సినిమా సక్సెస్ వెను వున్నాయి. ఆ సినిమా తరువాత మళ్లీ ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఇది ఓ చిత్రమైన పరిస్థితిలా కనిపిస్తుంది.

కానీ శ్రీకాంత్ కొడుకు కోసం ఏమీ హడావుడి ప్లానింగ్ చేయడం లేదు. మలయాళంలో ఓ సినిమా వుంది..వైజయంతీ మూవీస్ లో ఓ సినిమా జరుగుతోంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి నిర్మించిన నిర్మాత ముప్పా అశోక్ తో ఓ సినిమా డిస్కషన్ లో వుంది. ఇలా స్లో అండ్ స్టడీ అన్నట్లు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది రోషన్. కానీ రోషన్ లుక్స్, ఈజ్ అన్నీ చూస్తుంటే టాలీవుడ్ లో ఓ మంచి యంగ్ హీరోగా స్ధిరపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి.

4 Replies to “సైలంట్ కిల్లర్-రోషన్”

Comments are closed.