జ‌గ‌న్ పీఆర్ టీమ్‌కు సంస్కారం నాస్తి.. అహంకారం జాస్తి!

జ‌గ‌న్ పీఆర్ టీమ్‌లో ఎలాంటి వాళ్లు ఉన్నారో అర్థం చేసుకోడానికి చంద్ర‌బాబుకు చెప్పిన సంస్కారం లేని శుభాకాంక్ష‌లే నిద‌ర్శ‌నం.

నిజాలే రాస్తే వైఎస్ జ‌గ‌న్ పీఆర్ టీమ్‌కు మ‌నోభావాలు దెబ్బ‌తింటాయి. కానీ త‌మ వైఖ‌రితో వైఎస్ జ‌గ‌న్‌కు, ఆయ‌న సార‌థ్యం వ‌హించే వైఎస్సార్‌సీపీకి రాజ‌కీయంగా న‌ష్ట‌మ‌నే స్పృహ ఉండ‌డం లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే జ‌గ‌న్ పీఆర్ టీమ్‌కు సంస్కారం నాస్తి… అహంకారం జాస్తి. ఇందుకు తాజా నిలువెత్తు నిద‌ర్శ‌నం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూ, జ‌గ‌న్ పేరుతో చేసిన ట్వీట్‌.

చంద్ర‌బాబునాయుడు 75వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు. వైఎస్ జ‌గ‌న్ తండ్రి దివంగ‌త వైఎస్సార్‌, చంద్ర‌బాబు రాజ‌కీయంగా స‌మ‌కాలికులు. దాదాపు స‌మ వ‌య‌స్కులు కూడా. ఇవాళ చంద్ర‌బాబు పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని, ఆయ‌న‌కు జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు చెప్ప‌డం మంచి ల‌క్ష‌ణం. జ‌గ‌న్ సూచ‌న‌తో ఆయ‌న పీఆర్ టీమ్ ఎక్స్‌లో శుభాకాంక్ష‌ల పోస్టు పెట్టింది. అగ్ర నాయ‌కులెవ‌రైనా తామే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌రు. ఆ ప‌నుల్ని ప్ర‌త్యేకంగా ప‌బ్లిక్ రిలేష‌న్స్ గురించి అవ‌గాహ‌న‌, భాషా ప‌రిజ్ఞానం ఉన్న టీమ్ చేస్తూ వుంటుంది.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎక్స్ ఖాతాలో బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డంలో క‌నీస సంస్కారాన్ని చాటుకోలేదు. దీంతో నెటిజ‌న్లు ఆ ట్వీట్‌పై చుర‌క‌లు అంటిస్తూ కామెంట్స చేయ‌డంతో త‌ప్పు స‌రిదిద్దుకోవ‌డం గ‌మ‌నార్హం.

“Happy Birthday to @Ncbn! Wishing you a peaceful and healthy long life!” అని మొద‌ట ట్వీట్ చేశారు. అంత పెద్ద మ‌నిషి, అలాగే ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి శుభాకాంక్ష‌లు చెప్పే విధానం ఇదేనా? అని నెటిజ‌న్లు దెప్పి పొడిచారు. గ‌తంలో జ‌గ‌న్‌కు పుట్టిరోజు శుభాకాంక్ష‌లు చెప్పే సంద‌ర్భంలో గారు అని చంద్ర‌బాబు ఎంతో సంస్కారంగా వ్య‌వ‌హ‌రించార‌ని నెటిజన్లు మండిప‌డుతూ కామెంట్స్ చేశారు. ఆ మాత్రం సంస్కారం కూడా లేదా? అని నిల‌దీశారు.

నెటిజ‌న్ల దెబ్బ‌కు జ‌గ‌న్ పీఆర్ టీమ్ అహంకారం రెండే రెండు నిమిషాల్లో పోయింది. ఆ ట్వీట్‌కు ఎడిట్ చేసి, చంద్ర‌బాబు పేరు ప‌క్క‌న గారు అని చేర్చ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ పీఆర్ టీమ్‌లో ఎలాంటి వాళ్లు ఉన్నారో అర్థం చేసుకోడానికి చంద్ర‌బాబుకు చెప్పిన సంస్కారం లేని శుభాకాంక్ష‌లే నిద‌ర్శ‌నం. పీఆర్ టీమ్ త‌ప్పిదానికి, జ‌గ‌న్ తిట్టు తినాల్సి వ‌స్తోంద‌న్న ఆవేద‌న వైసీపీ శ్రేణుల నుంచి వ‌స్తోంది.

24 Replies to “జ‌గ‌న్ పీఆర్ టీమ్‌కు సంస్కారం నాస్తి.. అహంకారం జాస్తి!”

  1. “సన్నాసుల నుండి సంస్కారం” expect చెయ్యడం సుద్ద దండగ 

    లో”ఫర్ లొంజోడుకు వాడు.. ఎప్పడూ ప్యాలెస్ లో పండి మొగోళ్ళు బట్టలు ఊడదీసి చీకడమే ఆనందం వాడికి.. 

  2. వెంకట్ రెడ్డి..

    ఒక సలహా.. నచ్చితే ఆచరించు.. నచ్చకపోయినా ఆచరించి చావు..

    ..

    జగన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్లదే తప్పు.. జగన్ రెడ్డి కి పాపం ఏమీ తెలీదు.. అమాయకుడు.. వెర్రిబాగులోడు.. ఎర్రిపప్ప.. కొండెర్రిపప్ప అంటూ జగన్ రెడ్డి అవలక్షణాలను మసి పూసి మారేడుకాయ ని చేద్దామని తెగ ప్రయత్నిస్తున్నావు..

    ..

    జగన్ రెడ్డి సంగతి తెలిసే కదా జనాలు 11 ఇచ్చారు..

    కొడాలి నాని ఎలా నోరు పారేసుకొనేవాడో.. జనాలకు ఇంకా గుర్తే..

    అంతెందుకు.. రోజా కూడా రెండ్రోజుల క్రితం.. పవన్ కళ్యాణ్ చిన్నకొడుకు మీద ఎలా బరి తెగించి మాట్లాడిందో చూసావు కదా..

    ఇవన్నీ జగన్ రెడ్డి పార్టీ సంస్కారాలే ..

    ఇవన్నీ జగన్ రెడ్డి లక్షణాలే..

    తప్పులన్నీ ఎవరో ఒకరి మీద తోసేస్తే.. జనాలు మిమ్మల్ని బెంగుళూరు నుండి కూడా తరిమేస్తారు..

    1. నాయకుడు అనేవాడు ఎలా ఉండకూడదో చక్కటి ఉదాహరణ మా అన్నయ్య..

  3. సొంత చిన్న తండ్రి నీ గొడ్డలి తో చంపిన స*న్నాసి, పం*ది పెం*ట తినే వాడికి సంస్కారం ఎందుకు వుంటది? 

    వాడు విసిరేసిన బిచ్చం ఏరుకునే నీకు వుండదు.

  4. చె*ల్లి నీ మో*సం చేసిన కు*క్క కు సంస్కారం ఉం*టదా ? 

    ఆ కు*క్క విసిరి వేస్తున్న బి*చ్చం కోసం ఎగ*బాకుతున్న వాడిని ఏమో అంటారో! 

  5. “నేను ఒక్కటే చెబుతున్నా చంద్రబాబు నాయుడుకి…” అని సాగుతుంది జగన్ ప్రసంగం అసెంబ్లీలో. ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ చేసే మారాం కి జవాబుగా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగం యొక్క వీడియో అది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా తిరుగాడిన ఆ వీడియోలో అతను చంద్రబాబు నాయుడు గారిని, ఆ “గారు” లేకుండా సంబోధించడం మనం గమనించవచ్చు. అతని ఉద్దేశాలనే ప్రతిబింబించే అతని ఐటీ టీం బహుషా అలాగే భావించి ఆ “గారు” లేకుండా శుభాకాంక్షలు చెప్పి ఉండవచ్చు. దానికి ఆ టీం ని ఎందుకు నిందించడం. ఎవరినైనా తప్పు పట్టాలంటే ముందు అది జగన్ ని మాత్రమే. 

Comments are closed.