విజయసాయి.. విభీషణుడు ఎంత మాత్రం కాదు

తాను ఓ విభీషణుడి మాదిరిగా సుద్దులు చెబుతున్నారు. మాట్లాడుతున్నారు. ఈ మాటల వెనుక ఎన్ని సందేహాలో?

రావణుడి ఇంటి గుట్టు వెల్లడించి రాముడి వెంట నడిచాడు విభీషణుడు. కానీ వైకాపా నుంచి బయటకు వచ్చిన విజయసాయి తనను విభీషణుడు అనుకుంటున్నారేమో.. ఎంత మాత్రం కాదు. ఎందుకంటే విభీషణుడి క్యారెక్టర్ మొదటి నుంచీ ఒకలాగే వుంది. మలుపులు, మాట మార్పులు లేవు. కానీ విజయసాయి పాత్ర అలా లేదు కదా. మరి ఎలా వుంది?

వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన ఓ ప్రొఫెషనల్ ఆడిటర్. వైఎస్ జమానాలో జగన్ కు సన్నిహితుడై పక్కదారి పట్టించే ఐడియాల ఇచ్చిన తెలివైన బిజినెస్ మన్… జగన్ అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకుడిగా మారారు. అదే టైమ్ లో అయిన వాళ్ల వ్యాపారాల కోసం, ఆస్తుల కోసం ఎన్ని చేయాలో అన్నీ చేసారు. ఇలా తడవకో అవతారం ఎత్తుతూ వచ్చారు. ప్రతి అవతారంలోనూ తన ఎదుగుదల చూసుకున్నారు. లాభ పడ్డారు.

ఇప్పుడు తాను ఓ విభీషణుడి మాదిరిగా సుద్దులు చెబుతున్నారు. మాట్లాడుతున్నారు. ఈ మాటల వెనుక ఎన్ని సందేహాలో?

రాజ్ కసిరెడ్డిని తానే పార్టీలోకి తీసుకువచ్చానని, కానీ క్రిమినల్ మైండ్ అని తెలియదంటారు?

సరే, మీకు ఎప్పుడు తెలిసింది విజయసాయి? అసలు ఎలా తెలిసింది. ఏం సంఘటన జరిగింది? ఏ క్రయిమ్ జరిగితే రాజ్ కసిరెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ అని మీకు అర్థం అయింది? అది క్లారిటీగా చెప్పాలి కదా? జగన్ కు చెప్పా అని మీరు అనొచ్చు. ఇప్పుడు జనం ముందుకు కదా మీరు వస్తున్నది. అందువల్ల అది కూడా జనానికి వివరించండి. మీకు కసిరెడ్డికి మధ్య ఏం జరిగితే, అతగాడిది క్రిమినల్ మైండ్ సెట్ అని మీకు తెలిసింది?

జగన్ జమానో మీతో సహా ప్రతి ఒక్కరు ఒక టూల్ మాత్రమే అని మీకు తెలియదా? మీరు తీసుకువచ్చిన రాజ్ కసిరెడ్డి, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడమో, మీకు వాటా పంచకపోవడమో చేసారు అంటే దాని వెనుక జగన్ వుంటారని అత్యంత తెలివైన మీకు అర్థం కాలేదా? కత్తి పట్టుకున్న చేతిని వదిలేసి కత్తితో వైరమా మీకు?

సరే ఈ వైనం పక్కన పెడదాం.

ఒక సంస్థలో వున్న తరువాత అనేకానేకం తెలుస్తుంటాయి. సంస్థను వదిలేసాక వాటిని కడుపులోనే దాచుకోవాలనే ఇంగితం వయసు రీత్యా అయినా విజయసాయికి రావాలి కదా? కత్తి పడితే, కాలు దువ్వితే నేరుగా, సీదాగా వుండాలి. ఓపెన్ అవ్వండి జగన్ మీద కాలు దువ్వండి. అప్పుడు కదా మీకు మజా వచ్చేది.

అలా కాకుండా అధికారంలో వున్నపుడు మీరు మీ వాళ్ల కోసం మీ వాళ్లతో కలిసి సాగించిన దందాలు అన్నీ ఇప్పుడు మెడకు చుట్టుకుంటాయన్న భయంతో, మీరు మారిపోయారు సర్ అని జనం అనుకోవాలని, అనుకునేలా చేయాలని, చేయడం కాదు కదా?

ఇవన్నీ ఇలా వుంచుదాం.

ఎదుటవారిని క్రిమినల్ మైండ్ సెట్ అనే ముందు తానేంటో విజయసాయి ఆలోచించాలి కదా. ఒక ఆడిటర్ గా జగన్ కు ఎలాంటి సలహాలు ఇచ్చారు. ఏ విధంగా కంపెనీలు ఏర్పాటు చేయించారు. అంతెందుకు, విశాఖలో ఏవిధంగా తన వ్యాపారాలు సాగించారు. ఏ విధంగా ఇతరుల వ్యాపారాలు తను తీసుకోగలిగారు. ఏ విధంగా తమ కుటుంబీకులకు వ్యాపారాలు, ఆస్తులు సమకూర్చగలిగారు.

అసలు కసిరెడ్డితో ఏ విధమైన బంధాలు లేకుండానే తన వాళ్ల సంస్థల నుంచి కోట్లకు కోట్లు ఆర్ధిక సహాయం అందించారు.

ఇవన్నీ చూస్తే కలిగే సందేహం ఒకటే. వాటాల పంపకం తేడా వస్తే మిత్రులు శతృవులే అవుతారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ వున్న వ్యక్తిగా విజయసాయి కి కనిపించడం వెనుక మర్మం ఇది తప్ప వేరు కాదని.

29 Replies to “విజయసాయి.. విభీషణుడు ఎంత మాత్రం కాదు”

  1. విజయసాయి విభీషణుడు కాకపోవచ్చు కానీ అన్న మాత్రం రావణాసురుడే, వాడి చెల్లి శూర్పణకే 

      1. రావణాసురుడు చెల్లెలి కోసం యుద్ధం చేశాడు కానీ ఈ నికృష్టుడి మీద వీడి చెల్లెలే యుద్ధం చేస్తోంది . సొంత తల్లి మీదే కేసు పెట్టే సన్నాసి కాదు రావణాసురుడు . 

    1. మీరు ఇలా రావణుడిని అవమానించడం తప్పు. రావణుడిలో సీత వ్యవహారం లో తప్ప చాల మంచి లక్షణాలు ఉన్నాయి

  2. ఇంగితం గురించి నువ్వు నీ బాస్ మాట్లాడకూడదురారేయ్ !!! జనం నోటితో నవ్వరు!!🙏

  3. అది కాదు రాయాల్సింది. వాటాల తేడా వాటంగా ( అందానికి పర్యాయపదం) ఉండే అధిపతిని ముంచుతుందా అని !

  4. సందింటి రెడ్డికి ఏమీ తెలీదు అంటావ్? డొల్ల కంపెనీలు పెట్టించి మనీ లాండరింగ్ చేసింది విజయసాయి రెడ్డే అంటావ్? సున్నపురాయి, ఇనుము, బాక్సైట్ తదితర గనులు కారుచౌకగా అస్మదీయులకు అప్పగించి వారి నుంచి లంచాలు పెట్టుబడుల రూపంలో తీసుకోలేదు అంటావ్? అసలు అన్నకి డబ్బు మీద ఆశే లేదు అంటావా 

  5. ///ఒక సంస్థలో వున్న తరువాత అనేకానేకం తెలుస్తుంటాయి. సంస్థను వదిలేసాక వాటిని కడుపులోనే దాచుకోవాలనే ఇంగితం వయసు రీత్యా అయినా విజయసాయికి రావాలి కదా?///

    .

    నీ ఎడుపు ఎమిటొ ఈ మాటల ద్వరా అర్ధం అయ్యింది!

  6. ఏమిటి … విజైసాయి జగన్ నీ పక్కదారి పట్టించాడా? అంటే ఫస్ట్ క్లాస్ అని చెప్పుకొనే అన్న బుర్ర లో గుజ్జు లేదంటావా?

  7. ప్రజల జీవితాలను మార్చే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోటో ఉండేలా చూసుకోవాల్సిన పని లేదు… కానీ 

    ప్రతి కుటుంబం ఎదుగుదలలో ముద్ర ఉంటేలా చేస్తే మాత్రం జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించినట్లే.

    తెలుగుదేశం పార్టీ అధినేత , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఘనత సాధించారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన పనులు సంస్కరణల వల్ల ప్రతి కుటుంబమూ ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవకాశాలు పొందింది. కొంత మంది ఆ అవకాశాల్ని ఉపయోగించుకుని ఓ మెట్టు పైకి ఎదిగి ఉండవచ్చు..కొంత మంది నేలపాలు చేసుకుని ఉండవచ్చు.. కానీ చంద్రబాబు ప్రయత్నాలు మాత్రం విఫలం కాలేదు.

    ఆకలైతే అన్నం పెట్టేవాడు లీడర్ కాదు.. ఆ అన్నం ఎలా సంపాదించుకోవాలో నేర్పేవాడు అసలైన లీడర్. ఒక్క సారి నేర్పితే జీవితాంతం సంపాదించుకుని తింటాడు. ఏ పనీ చేసుకోలని వాళ్లకు రోజూ కడుపు నింపే సంక్షేమం ఉండాలి. ఈ సిద్ధాంతాన్ని చంద్రబాబు నమ్మారు. 28 ఏళ్ల వయసులో చంద్రబాబు రాజకీయం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ.. రాజకీయంగా మాత్రం ఎదుగుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఆయన తెచ్చిన మార్పే ఈ ఎదుగుదలకు కారణం.

    బయట ప్రపంచం అంతా ఆయనను ఆరాధిస్తుంది. కానీ సొంత రాష్ట్రంలో అంత ఏకపక్ష మద్దతు ఉండదు. ఎన్టీఆర్‌కే ఇలాంటి పరిస్థితి తప్పలేదు. చంద్రబాబుకు కూడా అంతే. ఆయనను రాజకీయంగా కుల, మత, ప్రాంతం కారణంగా విబేధించేవారు ఉంటారు కానీ.. పనితీరు పరంగా ఎవరూ విమర్శించలేరు.

    కొత్త తరానికి చంద్రబాబు అంటే ఏమిటో.. ఆయన అరెస్టు సమయంలో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. దటీజ్ చంద్రబాబు అని.

    చంద్రబాబు మా రాష్ట్రానికి సీఎం అయి ఉంటే ఈ పాటికి చైనాతో పోటీపడే ఎకానమీని సాధించేవాళ్లం అని ఇతర రాష్ట్రాల ప్రజలు అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు.. 2019లో ఓడిపోకపోతే అన్న భావన వచ్చినప్పుడు ఆంధ్రుడికీ అదే అభిప్రాయం వస్తుంది. తన పనితీరుపై ప్రజల్లో అలాంటి ముద్ర వేశారు చంద్రబాబు.

    పనిలోనే విశ్రాంతి వెదుక్కునే అవిశ్రాంత *అభివృద్ధి ఋషి* కి

    75వ జన్మదిన శుభాకాంక్షలు.

  8. ఈ  చెత్త బతుకులకి పురాణాల నుంచి రిఫరెన్స్ తెచ్చావ్ చూడు నీ అంత పనికిమాలినోడు ఇంకొకడు లేడు .  వాళ్ళు బైబిల్ ను నమ్ముతారు , అందులో ఏమైనా కనిపిస్తే చెప్పు . బేవర్స్ నా కొడకా 

  9. అయితే అన్ని వాటాలు తెల్తాయ్ వాటాలు ఇచ్చింది ఎవరు తీసుకుంది ఎవరి అన్ని తేలితే మంచిది ఘనమైన.కుటుంబ చరిత్ర

  10. నువ్వు ఇలా రాసుకుంటూ పోతే రేపు ఈ వీసా రెడ్డి అప్రోవర్ గా మారితే మీ దద్దమ్మ గాడు చరిత్ర హీనుడు గా మిగిలిపోతాడు

    1. అర్ ఓ ముట్టర్..జగన్ ఏదైనా అక్రమం చేసినట్టు ఈడు చెపితే అందులో వీడి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది..నీ హూక్కూ అది తెలిసి సచ్చేనా

      1. పేరు లేని Klp, దానికి ఓ రీజన్ ఉంటుంది అది తెలిసి సచ్చేనా నీకు

  11. “జగన్ కు సన్నిహితుడై పక్కదారి పట్టించే ఐడియాల ఇచ్చిన తెలివైన బిజినెస్ మన్”..lol

  12. ఈ లెక్కన పతోడు వచ్చి, జాన్ రెడ్డి గాడు ముక్కులో,  ముడ్డిలో , నోట్లో, గుడ్డ లో , చెవిలో ఎక్కడ పడితే  అక్కడ ఏ బొక్క లో దొరికితే అక్కడ,

     దూర్చుతూ వింటే, వాడు సమ్మగా ఎంజాయ్ చేస్తూ వుంటాడు అన్న మాట. నోరు తెరచి వద్దు అనడు అన్నమాట. 

Comments are closed.