కోట‌రీ ఊబిలో జ‌గ‌న్‌!

వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న కోట‌రీ ఊబిలో ఇరుక్కున్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న కోట‌రీ ఊబిలో ఇరుక్కున్నారు. జ‌గ‌న్‌ను విమ‌ర్శించే వాళ్లంతా, ఆయ‌న ఆద‌రించి నెత్తిన పెట్టుకున్నోళ్లే కావ‌డం గ‌మ‌నార్హం. సొంత చెల్లి ష‌ర్మిల మొద‌లుకుని, తాజాగా విజ‌య‌సాయిరెడ్డి వ‌ర‌కూ… ముందూవెనుకా ఆలోచించ‌కుండా జ‌గ‌న్ నెత్తిన పెట్టుకున్నారు. మ‌నుషుల మ‌న‌స్త‌త్వాల్ని అంచ‌నా వేయ‌డంలో జ‌గ‌న్ అట్ట‌ర్ ప్లాప్ అయ్యార‌నేందుకు ఎన్ని ఉదాహ‌ర‌ణ‌లైనా చెప్పొచ్చు.

ముఖ్య‌మంత్రిగా, అలాగే పార్టీ అధినేత‌గా జ‌గ‌న్ సొంత నిర్ణ‌యాలు తీసుకున్న‌ది త‌క్కువే. ఇత‌రుల అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేని వారికి ప్రాధాన్యం ఇచ్చారు. దాని ప‌ర్య‌వ‌సానాల్ని ఇప్పుడు జ‌గ‌న్ అనుభ‌విస్తున్నారు. చేసుకున్నోళ్ల‌కు చేసుకున్నంత మ‌హ‌దేవ అంటే ఇదే కాబోలు. జ‌గ‌నైనా, మ‌రెవ‌రైనా త‌ప్పొప్పుల‌కు వాళ్లే బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంది.

మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌జాభిమానాన్ని చూన‌గొనేలా ఆలోచ‌న‌లు వుండాలి. అందుకు భిన్నంగా వుంటే, ఎంత‌టి వారైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. దానికంటూ ఒక స‌మ‌యం వుంటుంది త‌ప్ప‌, ఏ మాత్రం త‌ప్పించుకోడానికి వీలుండ‌దు.

ఫ‌లానా X, Y, Z నాయ‌కులు సిఫార్సు చేశార‌ని ఏ మాత్రం స్థాయిలేని నాయ‌కుల‌కు పార్టీప‌రంగా, అలాగే ప్ర‌భుత్వంలోనే కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌దే. వైఎస్సార్ శ్రేయ‌స్సు కోరి కేవీపీలా ఆలోచించే నాయ‌కులెవ‌రూ జ‌గ‌న్ చుట్టూ లేరు. కేవ‌లం సొంత ప్ర‌యోజ‌నాలు కాపాడుకునేందుకు జ‌గ‌న్ అనే మాస్ లీడ‌ర్‌ను వాడుకుంటున్నార‌ని వైసీపీ శ్రేణులు ఆవేద‌న చెందుతున్నాయి.

ప్ర‌ధానంగా ఆర్థికంగా బాగా వెన‌కేసుకున్న నాయ‌కులు ఒక్కొక్క‌రుగా జ‌గ‌న్‌ను వీడుతున్నారు. పోతూపోతూ జ‌గ‌న్‌పై అభాండాలు వేస్తున్నారు. జ‌గ‌న్‌ను అడ్డుపెట్టుకుని కావాల్సినంత సంపాదించుకుని, ఇప్పుడు దాన్ని ప‌రిర‌క్షించుకోడానికి కొత్త అవ‌తారాలు ఎత్తుతున్నారు. ఇవ‌న్నీ జ‌గ‌న్‌కు అర్థ‌మ‌వుతున్నాయో, లేదో మ‌రి! అవ‌కాశ‌వాదులంతా ఎక్క‌డున్నారంటే, జ‌గ‌న్ చుట్టూనే అనే స‌మాధానం వ‌స్తోంది. పొగడ్త‌ల‌కు జ‌గ‌న్ ఫిదా అవుతుంటారు. ప్ర‌శంస‌ల ప్ర‌లోభాల‌కు లొంగ‌ని రాజ‌కీయ నాయ‌కులుండ‌రు. అయితే ఏ ప్ర‌శంస వెనుక‌, ఎలాంటి ప్ర‌యోజ‌నాలు దాగి వున్నాయో గుర్తించే వారే తెలివైన నాయ‌కుడ‌వుతారు.

జ‌గ‌న్‌లో అజ్ఞానం కంటే అమాయ‌కత్వం ఎక్కువ‌. తాను చూసిందే, విన్న‌దే నిజ‌మ‌ని న‌మ్ముతుంటారు. రాజ‌కీయాల్లో ఎప్ప‌టికీ క‌నిపించేవి, వినిపించేవి నిజాలు కావు. అదే రాజ‌కీయం అంటే. బ‌హుశా రాజ‌కీయంగా భారీగా న‌ష్ట‌పోయిన త‌ర్వాతైనా, జ‌గన్‌కు వాస్త‌వాలు తెలుస్తుంటాయా? అనే అనుమానం క‌లుగుతోంది. ఎందుకంటే, జ‌గ‌న్‌లో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్న మార్పు క‌నిపించ‌డం లేదనే మాట వినిపిస్తోంది.

మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే వైసీపీని పున‌ర్నిర్మించుకోవాల్సిన బాధ్య‌త జ‌గ‌న్‌పై వుంది. తానే మెకానిక్ అవతారం ఎత్తాలి. త‌న కోట‌రీలోని ఏ రెడ్డికో మెకానిక్ బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తే, అంతోఇంతో న‌డిచే బండిని కూడా చెడ‌గొట్టి షెడ్డుకు త‌ర‌లిస్తారు. త‌క్ష‌ణం జ‌గ‌న్ కోట‌రీ ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డితేనే, ఏదైనా చేసే అవకాశం వుంది. ఎవ‌రో వ‌స్తారు, ఏదో చేస్తార‌ని జ‌గ‌న్ ఎదురు చూస్తే, జీవిత కాలం ఎదురు చూపే మిగులుతుంది.

23 Replies to “కోట‌రీ ఊబిలో జ‌గ‌న్‌!”

  1. కరెక్ట్ గా చెప్పావ్ ఎంకి!! వీడొక useless fellow అని మేము ముందు నుండి చెప్తూనే ఉన్నాం నీకే ఇప్పటికి అర్థమైంది!! worlds top ఎం  and useless criminal వాడు!!

  2. షర్మిల ని నెత్తిన పెట్టుకున్నాడా?వాడు జైల్లో ఊచలు లెక్కిస్తుంటే కాళ్ళు అరిగేలా పాదయాత్ర చేసి పార్టీ ని కాపాడింది.లేకుంటే వాడికి అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా వచ్చేది కాదు..అయినా వైసీపీ అనేది ఒట్టికుండ…దానిని మల్ల మోసే వాడు..కోటరీ…గో to హెల్.

      • అయ్యబాబోయ్ ఈ జి ఏ గాడి ఎలివేషన్స్. పెట్టిన హెడింగ్ ఎంటి వీడు రాసిందేంటి? ఈ కోటరీ మీద ఎన్ని రాశాడు? వీడింకా స్వాతిముత్యం లో కమలహాసన్ అనుకుంటున్నాడు.
  3. నువ్వు చెప్పిన ఇద్దరి వల్లే వాడికి డబ్బు అయినా, అధికారమైనా వచ్చినాయిరా అయ్యా, ఇప్పుడు వాళ్లు కూడా పోయారు. మిగిలింది ఎవర్రా అంటే నువ్వు, సజ్జల, అంబటి, గోరంట్ల, అనంతబాబు, దువ్వాడ, రోజా, శ్యామల ఇలాంటి తాలు బ్యాచ్.. ఇలాగే ఉంటే వచ్చేసారి ఫుట్బాల్ ⚽ టీం కూడా గ్యారెంటీ లేదు

  4. ఒరెయి, కన్న తల్లి మొదలు, తోడబుట్టిన వాళ్లు, ఇంట్లో వాళ్ళు, చుట్టాలు ఛీ కొడుతున్నారు, ఆదరించినోళ్ళు ఛీ కొడుతున్నారు, గతంలోని స్నేహితులు ఛీ కొడుతున్నారు, తండ్రికి అత్యంత నమ్మకస్తులెవరూ దగ్గరికి రారు, తరతరాలు ఆ కుటుంబంతో కలిసి ఉన్న వాళ్ళు, సాక్షాత్ తోడు దొంగలు కూడా ఛీ కొట్టి వెళ్ళిపోతున్నారు. అయ్యినా నీకు అడింకా మంచోడు అమాయకుడు అనే అనిపిస్తున్నాడు. ఒకసారి సైకాలజిస్ట్ ని చూసి రాకూడదు!!!

      1. ఏంటి బ్రో అందరూ కలిసి ఈ వెబ్సైట్ ని మూయించేస్తారా? మర్యాదగా వాడే మూసుకుకునేదాక వెయిట్ చేద్దాం 

  5. ఏమిటి అన్న జైల్ లో ఉన్నాడని దమ్మిడి లాభం లేకపోయినా 3000 కిలోమీటర్లు నడిచిన జగన్ నెత్తిన పెట్టుకున్నాడా? ఏమిటి జగన్ కోసం పదహారు నెలలు జైలు లో ఉన్న జగన్ నెత్తిన పెట్టుకున్నాడ ? గట్టిగా అనకు ముడ్డి తో నవ్వుతారు

  6. ప్రజల జీవితాలను మార్చే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోటో ఉండేలా చూసుకోవాల్సిన పని లేదు… కానీ ప్రతి కుటుంబం ఎదుగుదలలో ముద్ర ఉంటేలా చేస్తే మాత్రం జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించినట్లే. తెలుగుదేశం పార్టీ అధినేత , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఘనత సాధించారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన పనులు సంస్కరణల వల్ల ప్రతి కుటుంబమూ ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవకాశాలు పొందింది. కొంత మంది ఆ అవకాశాల్ని ఉపయోగించుకుని ఓ మెట్టు పైకి ఎదిగి ఉండవచ్చు..కొంత మంది నేలపాలు చేసుకుని ఉండవచ్చు.. కానీ చంద్రబాబు ప్రయత్నాలు మాత్రం విఫలం కాలేదు.

    చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు నేటి తరానికి తెలియవు. అప్పట్లో అభివృద్ధి అనేది ద్వితీయ ప్రాధాన్య అంశం. ఉపాధి అవకాశాల గురించి ఆలోచించే నేతలు ఉండేవారు కాదు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశ రాజకీయ దృక్కోణం మారిపోయింది. యువతకు ఉపాధి అందించడానికి ఆయన సాహసం చేశారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయి. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజలు బాగుపడితే తనకు జరిగే నష్టం పెద్ద నష్టం కాదని ముందుకే వెళ్లారు. ఇంజనీరింగ్ విద్య నుంచి ఐటీ ఉద్యోగాల వరకూ.. వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందే యువతకు సాయం వరకూ చంద్రబాబు ముద్ర అనన్య సామాన్యం. 

  7. ////// జ‌గ‌న్‌లో అజ్ఞానం కంటే అమాయ‌కత్వం ఎక్కువ‌. //////

    .

    మొత్తం మీద అజ్ఞాని అని కూడా ఒప్పుకున్నావ్! అయన అమాయ‌కుడు,  పత్తితు అంటె సొంత తల్లి, చెల్లినె నవుతారు!

    .

    ఆయనకి చలా అతివిశ్వసం. రాజ్జంగం, కొర్త్లు, సాదారన ప్రజలు కూడా తనని ఎమి చెయలెరు అన్న అహంకారం! అదె దెబ్బ కొట్టింది!

  8. //జ‌గ‌న్‌లో అజ్ఞానం కంటే అమాయ‌కత్వం ఎక్కువ‌.///

    .

    మొత్తం మీద ఈయన అజ్ఞాని అని ఒప్పుకునావ్! అయన అమాయ‌కుడు అంటె సొంత తల్లి, చెల్లినె నవుతారు!

    ఆయనకి చలా అతివిశ్వాసం. రాజ్జంగం, కొర్ట్ లు, సాదారన ప్రజలు కూడా తనని ఎమి చెయలెరు అన్న అహంకారం! అదె దెబ్బ కొట్టింది!

  9. Powerlo ki vachindi anna valla, power lo vunnappudu people ki mottam chesindi anna, powerlo government mottam nadipindi anna, power poyina tarvata mottam pakkanollu chesaara, what a licking 

  10. జగన్ ను నమ్మి మోసపోయిన సోనియా.

    జగన్ నీ నమ్మి మోసపోయిన Ys విజయమ్మ

    జగన్ నీ నమ్మి మోసపోయిన షర్మిల

    ..

    దీనికి అంతు లేదు.

    ఇంత మందిని మోసం చేసిన లా*త్కోరు గాడికి ఊ*డిగం చేస్తూ, వా*డి అక్రమ సంపా*దన లో తన వా*ట కో*సం ట్రై చేస్తున్న గ్రేమ్ ఆంద్ర.

  11. యేసు క్రీస్తు అంటావా,

    ఐతే మేకు లు కొట్టి ఎక్కిస్తే సరి.

    జనాలు వేసే చిల్లర తో చాలా డబ్బు వస్తది, వినాశం కి.

  12.  ప్యాలెస్ పులకేశి గాడి కంటే 

     వాడి బొమ్మ కి విలువ ఉంది అని ప్యాలెస్ లో వినాశం ముఠా కి గొప్ప ఐడియా వచ్చింది అంట కదా. 

    అంటే ప్యాలస్ పులకేశి..  వైఎస్సార్, వివేక లాగ తాను వేసిన ప్లాన్ లో తానే పాత్ర దారి అవుతాడ !

  13. చెల్లిని నెత్తిన పెట్టుకున్నాడా? అధికారం వచ్చేవరకు వాడుకొని బయటికి నెట్టేశాడు. కవర్ చెయ్యకు GA

    1. అధికారం పోయిన తరువాత ఈ జి ఏ గాడిని పట్టించుకోవట్లేదు . అది వేడి బాధ. వెబ్సైట్ నడపడానికి డబ్బులు లేవేమో ? అన్న అధికారం లో ఉన్నప్పుడు ఈ జి ఏ గాడికి కళ్ళు నెత్తికెక్కాయి. అప్పుడు కనపడని తప్పులు ఇప్పుడు టన్నుల కొద్దీ బయటికొస్తున్నాయి. 

  14. వాడు అమాయకుడు కాదు అజ్ఞాని దద్దమ్మ, ఏదో వైఎస్ పేరు పుణ్యాన సిఎం అయ్యాడు కానీ వానికి ఉన్న అహంకారానికి అజ్ఞానానికి వాడికి ముఖ్యమంత్రి అయ్యే యోగ్యతె లేదు

Comments are closed.