ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ముందుగా ఆయనకు శుభాకాంక్షలు. దేశ రాజకీయాల్లోనే సీనియర్ నేతగా చంద్రబాబుకు గుర్తింపు వుంది. బాబు జీవితంలో వెలుగుచీకట్లు ఎన్నెన్నో. పడుతూ, లేస్తూ తనదైన ప్రత్యేక పంథాలో రాజకీయాల్లో చంద్రబాబు రాణించారు. బాబు అంటే నచ్చిన వాళ్లు విజనరీ, చాణక్యుడంటే, నచ్చని వాళ్లు వెన్నుపోటుదారుడు, నయ వంచకుడు అని తిడుతుంటారు. రాజకీయాల్లో పూలే కాదు, రాళ్లు కూడా వేస్తుంటారని, వాటిని భరించాలని చంద్రబాబు జీవితం నేర్పుతున్న గుణపాఠం.
చంద్రబాబునాయుడి రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు నారా లోకేశ్ వచ్చారు. రెండో దఫా ఆయన మంత్రిగా పని చేస్తున్నారు. రోజురోజుకూ ఆయన రాజకీయంగా రాటుదేలుతున్నారు. తండ్రి జీవితం నుంచి రాజకీయ పాఠాలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటున్నారు. లోకేశ్‌కు పట్టాభిషేకంపై కొంతకాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది.
వయసు పైబడుతున్న నేపథ్యంలో లోకేశ్ పట్టాభిషేకంపై చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది. మరీ ముఖ్యంగా టీడీపీకి 100కు పైగా అసెంబ్లీ సీట్లు దక్కాయి. ప్రభుత్వాన్ని నడపడానికి ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు. అయితే కలిసి పోటీ చేయడంతో 164 అసెంబ్లీ సాధించారన్నది వాస్తవం.
లోకేశ్‌ను సీఎం చేయడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు అనే చర్చ టీడీపీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున జరుగుతోంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. అవకాశం వచ్చినపుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేయకుండా తప్పు చేశామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మదనపడుతోంది. అలాంటి తప్పును చంద్రబాబు చేస్తారని ఎవరూ అనుకోరు.
నాలుగో దఫా సీఎంగా చంద్రబాబు పని చేస్తున్నారు. లోకేశ్‌కు పట్టాభిషేకం చేసి, వెనకుండి కుమారుడిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత చంద్రబాబుపై వుంది. రాజకీయాల్లో శరవేగంగా మార్పులొస్తున్నాయి. కావున చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా, త్వరలో లోకేశ్‌కు తన పదవి ఇస్తే, టీడీపీ భవిష్యత్ నాయకుడిని తయారు చేసినట్టు అవుతుంది. రాజకీయాల్లో వర్తమానం నిజం, రేపు అనేది అబద్ధం. అందువల్లే చంద్రబాబు తన కుమారుడి భవిష్యత్‌పై దృష్టి సారించాల్సిన సమయాన్ని 75వ పుట్టిన రోజు గుర్తు చేస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఏదైనా రెడ్డి, ఎదుటివాళ్ళు ఏమనుకుంటున్నారో నీకు భలే తెలిసిపోతుంది
ఎం కరుణానిధి ఉన్నంతవరకు స్టాలిన్ సీఎం అవ్వకుండ ఆగలేదా?? అఖిలేష్ యాదవ్ తన తండ్రి తనని సీఎం చేసే వరకు ఆగలేదా???? అందరు మన అన్న ఫామిలీ లో లాగా ఉండరు పార్థివ దేహం ఇంకా అంతిమయాత్రకు పోకముందే సంతకాలు పెట్టించిన ఘనత మనది …ఆదివారం లో వాటా ఇవ్వాల్సి వస్తుందేమో అని తల్లి ని చెల్లి ని పక్క కి తోసేసిన చరిత్ర మన అన్న ది…అలంటి వాళ్ళ మోచేతి నీళ్లు తాగే మీకు కూడా అందరు అలానే కనపడతారు….
టీడీపీ శ్రేణులు ఎవరూ భావించడం లేదులే …నువ్వు కంగారుపాడకు. ఇలాంటి ఆలోచన తోనే బాబాయ్ సీట్ ఇమ్మని అడిగితే సోనియా ఛిపో అన్నది. ఇక ఇలాంటి ఆలోచన తోనే టైం వచ్చింది అని వైఎస్ఆర్ కి ద్రోహం చేశారా అనే అనుమానం కలుగుతుంది
అది లేట్ అవాలని కొరుకోరా అయ్యా, అది తొందరగా జరిగితే అన్న కి ఇంక పైన, కింద తడవటమే ప్రతిరోజూ
వాడు ‘అన్న’ కాదు అన్నియ్య. అన్న అంటే పెద్దాయన ఎన్టీఆర్ గుర్తుకొస్తారు బ్రదర్ .
మా ఆయుష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లు ఈ తెలుగు నేల కోసం కష్ట పడుతూనే వుండు చంద్రన్న!
నీ జీవితం ఒక స్ఫూర్తి.. నీ నిబ్బరం, సహనం,ఓపిక,దూరదృష్టి, ఇప్పటి తరానికి ఒక పాఠం.. ..ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటం లో నిలపాలని నువ్వు పడే తపన కి మా సహకారం.. తోడ్పాటు ఎల్లప్పుడూ వుంటుంది అని ప్రమాణం చేస్తూ… హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

సీబీన్ ని ప్రేమించే,అభిమానించే ప్రతీ ఒక్కరి ఆలోచనలు ఒకే విధంగా వుంటాయి బ్రో
మాకు ఆయన చేసిన గొప్ప పనులు గుర్తొస్తున్నాయి!! యువతతో పోటీ పడి పని చేయటం గుర్తొస్తుంది!!
ఇంకా ఏదో సాధించాలి అనే తపన, ప్రజాసేవే పరమావధి అనే గొప్ప మనస్తత్వం గుర్తొస్తుంది!!
రాష్ట్రాన్ని ప్రపంచపటంలో గొప్పగా నిలపాలి అనే మొహోన్నత సంకల్పం గుర్తొస్తుంది!!
ఆయన ఒక 75 వసంతాల నవ యువ నాయకుడు
హహహహ… వయసు అంటుంటే నరసింహ సినిమాలో రజినికాంత్ డైలాగ్ గుర్తుకు వస్తుంది. క్లైమాక్స్ ఫైట్ లో..
అబ్బాస్ ని కార్ లో కూర్చిని చూస్తూ ఉండ మంటాడు.. ‘నా వయసు’. ఇక్కడ సీబీన్.. రజిని కాంత్..అబ్బాస్ లోకేష్..;)
చంద్రబాబు మా రాష్ట్రానికి సీఎం అయి ఉంటే ఈ పాటికి చైనాతో పోటీపడే ఎకానమీని సాధించేవాళ్లం అని ఇతర రాష్ట్రాల ప్రజలు అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు 2004లో ఓడిపోకపోతే.. 2019లో ఓడిపోకపోతే అన్న భావన వచ్చినప్పుడు ఆంధ్రుడికీ అదే అభిప్రాయం వస్తుంది. తన పనితీరుపై ప్రజల్లో అలాంటి ముద్ర వేశారు చంద్రబాబు.
–
–
మీరు మా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఈ నేలకి ఇంకా చాలా సేవ చేయాలని కోరుకుంటూ
–
పనిలోనే విశ్రాంతి వెదుక్కునే అవిశ్రాంత “అభివృద్ధి రుషి”కి 75వ జన్మదిన శుభాకాంక్షలు.
ఆకలైతే అన్నం పెట్టేవాడు లీడర్ కాదు.. ఆ అన్నం ఎలా సంపాదించుకోవాలో నేర్పేవాడు అసలైన లీడర్. ఒక్క సారి నేర్పితే జీవితాంతం సంపాదించుకుని తింటాడు. ఏ పనీ చేసుకోలని వాళ్లకు రోజూ కడుపు నింపే సంక్షేమం ఉండాలి. ఈ సిద్ధాంతాన్ని చంద్రబాబు నమ్మారు. 28 ఏళ్ల వయసులో చంద్రబాబు రాజకీయం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ.. రాజకీయంగా మాత్రం ఎదుగుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఆయన తెచ్చిన మార్పే ఈ ఎదుగుదలకు కారణం.
–
రాజకీయాల్లో అజాతశత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ప్రధాన పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే.. మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మంచి చేసినా.. చెడు చేసినా.. చెడుగానే ప్రచారం చేస్తారు. బయట ప్రపంచం అంతా ఆయనను ఆరాధిస్తుంది. కానీ సొంత రాష్ట్రంలో అంత ఏకపక్ష మద్దతు ఉండదు. ఎన్టీఆర్‌కే ఇలాంటి పరిస్థితి తప్పలేదు. చంద్రబాబుకు కూడా అంతే. ఆయనను రాజకీయంగా కుల, మత, ప్రాంతం కారణంగా విబేధించేవారు ఉంటారు కానీ.. పనితీరు పరంగా ఎవరూ విమర్శించలేరు.
ఇప్పటికే సర్వ శాఖల మంత్రి.ఇప్పటికె ఉత్సవ విగ్రహం CBN ఐతే మూలవిరాట్టు లోకేశం. పట్టాభిషేకం అవసరం లేదులే
ఏం తొందరగా ఉందా.. లోకేష్ బాబు కి పట్టాభిషేకం చేస్తే అందగాడికి అజ్యాతవాశమే
Naaku telusuley..pappu peetam yekkitey..ika party govinda..