తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఆశ పెట్టుకున్నారు. అనర్హత వేటు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో వుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి తీవ్ర జాప్యం చేస్తున్న స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమకు అనుకూల తీర్పు వస్తుందని, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ నేతలు ఉత్సాహంగా ఉన్నారు.
అదే జరిగితే ఉప ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా కూడా బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత వుందని బీఆర్ఎస్ నమ్ముతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా కామెంట్స్… ఎన్నికలపై ఆ పార్టీ ఆశల్ని ప్రతిబింబిస్తోంది. తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్‌కు చెందిన కొంత మంది నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. రాజేంద్రనగర్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
కేటీఆర్ మాట్లాడుతూ రాజేంద్రనగర్‌లో ఉప ఎన్నిక జరుగుతుందని, కార్తీక్‌రెడ్డి గెలుస్తాడని జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత కేసీఆర్, బీఆర్ఎస్ నష్టపోలేదని, ప్రజలే చాలా కోల్పోయారన్నారు. రేవంత్‌రెడ్డి మాయ మాటలు నమ్మి వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు నష్టపోయారని ఆయన అన్నారు.
అభివృద్ధి చేసిన వైఎస్సార్, చంద్రబాబు గురించే ఇంకా మనం చెప్పుకుంటామన్నారు. కానీ రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన మంచి గురించి మాట్లాడుకోలేని పరిస్థితి వుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన అన్నారు.
TILLU GADIK1 PICHI EKK1NDI
కెసిఆర్ గారు ఓడిపోయిన పుంజుకునే అవకాశాలు చాలావున్నాయి కానీ ఆంధ్రాలో మాత్రం జగన్ గారు దాదాపు అసాధ్యం అయన గారు కి వ్యతిరేకం గ ఏ పరిస్థితి లోను ఆయనను రానివ్వకూడదనే వర్గం 40 % వుంది ఆయనకు వున్నా మద్దతు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసేసిన సంక్షేమ పథకలోళ్లు మాత్రమే వుంటారు అందులో నాణ్యమైన మందు రేట్ తగ్గింది పిచ్చి బ్రాండ్లు పోయాయి దానితో మందుబాబులు ఆయనను రానివ్వరు నెక్స్ట్ ఎలక్షన్ లలో అయన కేవలం సింగల్ డిజిట్ మాత్రమే బహుశా అయన తప్ప ఎవరు గెలవరు ఆ పార్టీ సింబల్ మీద పోటీచేసేకన్నా ఇండిపెండెంట్ గ పోటీచేస్తేనే గెలిచే అవకాశాలు ఉంటాయి