మా బాపు మంచోడు.. నేను రౌడీని..!

కేసీఆర్​ గారాలపట్టీ, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత లిక్కర్​ స్కామ్​లో తీహార్​ జైల్లో ఆరు నెలలు గడిపి వచ్చాక బాగా యాక్టివ్​ అయిపోయింది.

కేసీఆర్​ గారాలపట్టీ, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత లిక్కర్​ స్కామ్​లో తీహార్​ జైల్లో ఆరు నెలలు గడిపి వచ్చాక బాగా యాక్టివ్​ అయిపోయింది. కేటీఆర్​, హ‌రీష్‌రావుకు మించి చెలరేగిపోతోంది. కాంగ్రెసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది. డిమాండ్లు చేస్తోంది. దీక్షలు చేస్తోంది. రేవంత్​ రెడ్డిని హామీలపై నిలదీస్తోంది. మొత్తం మీద ప్రతిరోజు జనాల్లో ఉంటోంది.

ఆమె తాజాగా బాన్సువాడలో మాట్లాడుతూ ‘మా బాపూ మంచోడు…నేను రౌడీని’ అని అన్నది. బీఆర్​ఎస్​ కార్యకర్తలను వేధించిన, బెదిరించిన, కేసులు పెట్టిన కాంగ్రెసు నాయకులను, అధికారులను వదిలిపెట్టబోమని, వారి పేర్లు పింక్​ బుక్​లో రాసుకుంటురన్నానని చెప్పింది. తాము అధికారంలోకి వచ్చాక వారిని వదిలే ప్రసక్తే లేదని, వారిని పోలీసు స్టేషన్లకు ఈడుస్తామని చెప్పింది. అలాంటివారిని క్షమించే ప్రసక్తే లేదని కవిత చెప్పింది.

కాంగ్రెసు నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, వాళ్ల తాతలు, జేజమ్మలు దిగొచ్చినా భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని అన్నది. అందరి పేర్లు పింక్​ బుక్​లో రాసుకుంటున్నామని హెచ్చరించింది. ‘ఇంకా ఎన్ని రోజులు ఈ దరిద్రం. ఈ ప్రభుత్వాన్ని తొందరగా దించండి’ అని ఓ తమ్ముడు అడిగాడని కవిత చెప్పింది. కొంతకాలం కిందట కేటీఆర్​ ఎక్కడో మాట్లాడుతూ ‘మా నాన్న మంచోడు. నేను ఆయనంత మంచోడిని కాను’ అన్నాడు.

ఇప్పుడు కవిత కాంగ్రెసు నాయకులకు, అధికారులకు వార్నింగ్​ ఇచ్చినట్లుగానే అప్పుడు కేటీఆర్​ కూడా వారిని ఇలాగే హెచ్చరించాడు. కాని పింక్ బుక్​ ప్రస్తావన తేలేదు. ఇక ఇప్పుడు కవిత ఇంకా కొద్దిగా రెచ్చిపోయి తాను రౌడీనని చెప్పింది. ఆమె గతంలోనే తాను పింక్​ బుక్​ ఓపెన్​ చేశానని, అందులో బీఆర్​ఎస్​ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నవారి పేర్లు రాస్తున్నానని చెప్పింది. టీడీపీ నేత నారా లోకేశ్ రెడ్ బుక్ తో ఏపీలో మొదలైన ఈ అపోజిషన్ బుక్ ట్రెండ్.. ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైంది.

పింక్ బుక్ లో పేర్లు రాస్తున్నామని కవిత చెబుతోంది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. కాషాయ బుక్ ను తెరపైకి తెచ్చాడు. తాము కాషాయ బుక్ ను మెయింటేన్ చేస్తున్నామని, తమను ఇబ్బంది పెడుతున్న వారికి కచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించాడు. మూడు పార్టీల వారు హెచ్చరిస్తున్నారు కాని అధికారంలోకి ఎవరొస్తారో ఏం చెప్పగలం?

7 Replies to “మా బాపు మంచోడు.. నేను రౌడీని..!”

Comments are closed.