అపోహ‌లా.. నారాయ‌ణ, నారాయ‌ణ‌!

అమ‌రావ‌తి రాజ‌ధానిపై అపోహ‌లు సృష్టించి, మ‌ళ్లీ ఏమీ తెలియ‌న‌ట్టు మంత్రి నారాయ‌ణ మాట్లాడ్డం విడ్డూరంగా వుంది.

అమ‌రావ‌తి రాజ‌ధానిపై అపోహ‌లు సృష్టించి, మ‌ళ్లీ ఏమీ తెలియ‌న‌ట్టు మంత్రి నారాయ‌ణ మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాజ‌ధాని అమ‌రావ‌తిపై కొంద‌రు లేనిపోని అపోహ‌లు సృష్టిస్తున్నార‌ని ఆరోపించారు. రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల‌కు ఎలాంటి అపోహ‌లు వ‌ద్ద‌న్నారు. భూముల రేట్లు పెర‌గాలంటే స్మార్ట్ ఇండ‌స్ట్రీస్ అమ‌రావ‌తికి రావాల‌న్నారు.

అందుకే ప్లైట్ క‌నెక్టివిటీ కోసం అమ‌రావ‌తిలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని నిర్మించాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆలోచించార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామ‌ని, రైతులు అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌న్నారు.

అస‌లు రాజ‌ధాని రైతుల్లో అపోహ‌లు రావ‌డానికి మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ కామెంట్సే కార‌ణం. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నిర్మించ‌డానికి ఐదు వేల ఎక‌రాలు అవ‌స‌ర‌మ‌న్నారు. అయితే ఇందుకోసం 44 వేల ఎక‌రాల భూమిని స‌మీక‌రించ‌డ‌మా? లేక సేక‌రించ‌డ‌మా? ఎలా చేయాల‌నేది ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. ఈ కామెంట్సే రాజ‌ధాని రైతుల్లో ఆందోళ‌న రేకెత్తించాయి. త‌మ భూముల‌కు విలువ రాకుండా పోతుంద‌ని, త‌ద్వారా భారీగా న‌ష్ట‌పోతామ‌ని రాజ‌దాని రైతులు కోర్టును ఆశ్ర‌యించాల‌ని నిర్ణ‌యించారు.

ఇందులో మ‌రెవ‌రో అపోహ‌లు సృష్టించాల్సిన అవ‌స‌రం ఏంటో నారాయ‌ణే చెప్పాలి. ఎందుకంటే, 44 వేల ఎక‌రాల్ని అద‌నంగా తీసుకుంటే, తొమ్మిదేళ్ల క్రితం ఇచ్చిన త‌మ భూముల ధ‌ర‌లు ఏమ‌వుతాయో అంద‌రికంటే స్థానికుల‌కే బాగా తెలుసు. అందుకే వాళ్ల‌లో భ‌యాందోళ‌న ఏర్ప‌డ్డాయి. ఆ కార‌ణంతోనే న్యాయ‌పోరాటం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. త‌ప్పుల్ని ప్ర‌భుత్వం చేస్తూ, నింద‌ల్ని మ‌రొక‌రిపై వేయ‌డం ఏంటో మంత్రికే తెలియాల‌ని ప‌లువురు అంటున్నారు.

2 Replies to “అపోహ‌లా.. నారాయ‌ణ, నారాయ‌ణ‌!”

  1. ఎవ్వడూ న్యాయపొరాటనికి సిద్దం అవ్వటం లెదు! అందరూ భూములు ఇవ్వటానికి సిద్ద పడుతున్నారు! మద్యలొ కొన్ని కుక్కలె మొరుగుతున్నాయి!

Comments are closed.