అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజ‌ర్‌పై ఆస‌క్తిక‌ర పిటిష‌న్‌

కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ల‌కుంటే, స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ ఫార్మ‌ర్స్ ఫెడ‌రేష‌న్ నాయ‌కుడు విజ‌య్‌పాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు.

తెలంగాణ‌లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌డం లేదు. దీంతో బీఆర్ఎస్ త‌ర‌పున దీటైన వాద‌న‌ల్ని కేసీఆర్ కుమారుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మేన‌ల్లుడైన హ‌రీష్‌రావు వినిపిస్తున్నారు. కేసీఆర్‌ను ఎలాగైనా అసెంబ్లీ స‌మావేశాల‌కు ర‌ప్పించాల‌నే ఉద్దేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి త‌దిత‌రులు కొన్ని సంద‌ర్భాల్లో రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్నారు.

అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లేందుకు స‌సేమిరా అంటున్నారు. ఈ ప‌రిస్థితిలో కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశాల‌కు డుమ్మా కొట్ట‌డంపై తెలంగాణ హైకోర్టులో ఆస‌క్తిక‌ర పిటిష‌న్ దాఖ‌లైంది. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ల‌కుంటే, స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ ఫార్మ‌ర్స్ ఫెడ‌రేష‌న్ నాయ‌కుడు విజ‌య్‌పాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఈ పిటిష‌న్ ఆస‌క్తిని రేపుతోంది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు ఎలా స్పందిస్తుంద‌నేది ఉత్కంఠ రేపుతోంది. అసెంబ్లీకి కేసీఆర్ వెళ్ల‌క‌పోతే, పిటిష‌న్‌దారుడికి వ‌చ్చిన ఇబ్బంది ఏంట‌నేది ప్ర‌శ్న‌. ఇదంతా కాంగ్రెస్ నాయ‌కులు వెనుక ఉండి ఆడిస్తున్న నాట‌కంగా బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

కాంగ్రెస్‌లో చేరిన త‌మ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసేలా స్పీక‌ర్‌ను ఆదేశించాల‌ని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్న నేప‌థ్యంలో, కౌంట‌ర్‌గా ఈ పిటిష‌న్‌ను ఆ పార్టీ చూస్తోంది.

6 Replies to “అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజ‌ర్‌పై ఆస‌క్తిక‌ర పిటిష‌న్‌”

  1. ఈ బత్తెబాజ్ గాడు అసెంబ్లీ కి పోయి పీకేది ఏమి లేదు అవినీతి ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆ లోడపిత్తుల కేటీఆర్ గాడ్ని తోలాడు…

      1. బత్తెబాజామ్మ గుడుంబా రాణి కవిత దానికి తీహార్ లో రాడ్ పెట్టారు అయినా ఇదేమి పోయే కాలం లోడపిత్తుల ముక్కోడి కుటుంబం అంతా లంగాలు

  2. తాగి తాగి లివర్ పూర్తిగా దెబ్బ కొడితే, లివర్ టాన్స్ప్లాంట్ కోసం సొంత కొడుకు, కూతురు లివర్ ముక్క ఇవ్వడ్డానికి కుదరదు అని చెబితే, పార్టీ లో వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాకపోతే, డబ్బు పెట్టీ ఆర్గాన్ మాఫియా వాళ్ళ ద్వారా చట్ట వ్యతిరేక మార్గాల్లో లివర్ కనుక్కోడానికి బాగా ట్రై చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా!

    అడిగితే, యూట్యూబ్ ఫుడ్ ఆంటీ గారు, రెండు ముక్కలు లివర్ ఎక్సట్ర వేసి పంపిస్తారు కదా

Comments are closed.