కలలు కనొచ్చు. కానీ ఆ కలలు హానికరం కాకూడదు. బీఆర్ఎస్ మీద పగబట్టినట్లు కిందా మీదా కష్టపడింది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. అక్కడితో అంతా అయిపోయింది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన వెనకటి గుణమేల మాను అన్నట్లు పాలించుకుంటూపోతోంది. చూస్తుంటే ఏ ప్రచారం అవసరం లేకుండానే జనాలు అధికారాన్ని బీఆర్ఎస్ చేతిలో పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇప్పుడు సదరు మీడియాకు కలవరంగా మారింది. అందుకే కొత్త కథలు అల్లుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా హవా కనిపించింది. వాస్తవం. అందువల్ల భాజపా- తేదేపా- జనసేన అనే ఎన్టీఎ కూటమి ప్రయోగం తెలంగాణలో కూడా చేసేస్తే అధికారం వచ్చేస్తుంది అని కలగంటూ వ్యాసం వండి వార్చారు. కానీ ఇక్కడ చాలా విషయాలు మరిచారు.
ఎన్టీఎ కూటమి ప్రయోగం ఏపీలో సఫలం కావడం వెనుక ఎన్ని కారణాలు వున్నాయో, తెలంగాణలో విఫలం కావడానికి అన్నే కారణాలు వున్నాయి.
భారాస అధికారంలోకి రావడానికి కారణమే తెలంగాణ నినాదం. యాంటీ ఆంధ్ర నినాదం. ఇప్పుడు తెలుగుదేశం-జనసేనతో భాజపా పొత్తు పెట్టుకుంటే భారాస కు అంతకన్నా ఆనందం ఇంకోటి వుండదు.
పైగా భాజపా ఎప్పుడైతే అన్ని పార్టీలను ఒకటి చేస్తుందో ముస్లిం ఓటు బ్యాంక్ మొత్తం భారాస వెనుక నిలుస్తుంది. మొన్న ఎన్నికల్లో అది కాంగ్రెస్ వైపు మళ్లిన సంగతి తెలిసిందే.
అసలు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం భాజపా తల ఎత్తుకుని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోయడం వెనుక అసలు రీజన్ వేరే. భాజపాలో ఏపీ లీడర్ల పెత్తనం, ముఖ్యంగా ఓ వర్గం పెత్తనం సహించలేని తెలంగాణలోని ఓ బలమైన సామాజిక వర్గం, తెలివిగా ఈ ఎత్తు వేసింది.
2014 టైమ్ లో ఏపీలో తేదేపాతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ తెలంగాణలో వద్దు అని లోకల్ భాజపా లీడర్లు తెగేసి చెప్పిన సంగతి మరిచిపోకూడదు.
అందువల్ల ఈసారి మాత్రం పొత్తు కు లోకల్ లీడర్లు అంగీకరిస్తారా? అనుమానమే! తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు రాదు అని ఈ మీడియానే చెబతున్నారు. కానీ కలిసి పోటీ చేస్తే ఇంపాక్ట్ వుంటుందట. నమ్మదగ్గ విషయమేనా?
ఇలాంటి రాతలు రాయడం వల్ల కూటమి ఏర్పాటు అనేది ముందుకు కదలొచ్చు. కానీ సవాలక్ష అడ్డంకులు వుంటాయి. భారాసకు మరింత ఊపు ఇస్తాయి. కాంగ్రెస్ పనైపోయింది అనే సంకేతాల్ని జనంలోకి బలంగా పంపిస్తాయి. భారాస మరింత గట్టిగా ఫైట్ చేసేంత మనోధైర్యం ఇస్తాయి.
అంతకు మించి ఇలాంటి ఆర్టికల్స్ సాధించేది కాదు.
Trs unte alage kani akkada BRS no use
నీకు మతి భ్రమించి గుర్తు లేదేమో కాని ఆంధ్ర లో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఇలానే జగన్ నెత్తిన పాలు పోశారు అన్నావ్..మూడు పార్టీలు కొట్టుకొని జగన్ కి లాభం చేస్తారు అన్నావ్.
Mama nuvvu keka
నీ ఎడుపు BRS వస్తుందెమొ అని కాదు! ముగ్గురూ తెలంగణలొ కూడా కలిస్తె, వారి భందం మరింత బలపడి, మన జగన్ అన్న మొదటికె మొసం వస్తుందెమొ అని!
.
ఏది క్లేయర్ గా చెప్పి చావవు!
Haaha
జిల్లేడు పాలే
Inthaki nuvvem ethhu vesav ee article lo ?
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,