అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని కాంక్షిస్తూ చేపట్టిన పాదయాత్ర తిరుపతి చేరింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో 40 రోజుల క్రితం 29 గ్రామాలకు చెందిన కొందరు మహాపాదయాత్ర పేరుతో నడక మొదలు పెట్టారు.
అమరావతిలో పరిపాలన, న్యాయ, శాసన రాజధాని వుండాలని, అన్ని ప్రయోజనాలు తమకే దక్కాలని అమరావతి రాజధాని అడ్డుపెట్టుకుని ఎల్లో బ్యాచ్ ఆడుతున్న డ్రామాలు అందరికీ తెలుసు.
నిజం నిప్పులాంటిది. అందువల్లే అమరావతి ప్రాజెక్ట్ డొల్లతనం బయటపడిందని చెప్పేవాళ్లు లేకపోలేదు. అమరావతిలోనే ఏకైక రాజధాని కొనసాగించాలనే డిమాండ్ వెనుక కొందరి ప్రయోజనాలు మాత్రమే దాగి ఉన్నాయని, ఆ ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా భస్మాసుర హస్తమని ఉత్తరాంధ్ర, రాయలసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజానీకం అభిప్రాయం. అందుకే అమరావతి ఉద్యమానికి, మహాపాదయాత్రకు ఏపీ ప్రజానీకం నుంచి ఏ మాత్రం మద్దతు రాలేదు.
కేవలం ఎల్లో మీడియా అత్యుత్సాహం తప్ప క్షేత్రస్థాయిలో వారికి అంత సీన్ లేదనే అభిప్రాయాలున్నాయి. ఇదిలా వుండగా తిరుపతికి చేరిన అమరావతి పాదయాత్రకు ఆ ఆధ్మాత్మిక నగర వాసులు వినూత్నంగా స్వాగతం పలకడం విశేషం.
తిరుపతి నగర వ్యాప్తంగా అమరావతి పాదయాత్రకు స్వాగతం పలుకుతూనే, మరోవైపు తమ ఆకాంక్షను ఆవిష్కరించడం ఆకట్టుకుం టోంది. చివరికి అమరావతిలోనే ఏకైక రాజధాని కొనసాగించాలని పాదయాత్రగా వచ్చిన వారిని కూడా ఆలోచింపజేసేలా, రాయలసీమ సంస్కృతి వుట్టిపడేలా ఓ నినాదం తిరుపతి నగరమంతా మార్మోగుతోంది. అదేంటంటే…
మీతో మాకు గొడవలు వద్దు – మీకు మా స్వాగతం
మాకు 3 రాజధానులే కావాలి అంటూ తిరుపతి ప్రజల పేరుతో నిలువెత్తు ఫ్లెక్సీలు తిరుపతిలో ఎటు చూసినా కనిపిస్తుండడం విశేషం. మీకు కనీసం హైకోర్టు కూడా వద్దు అంటూ నినదిస్తూ వచ్చిన వాళ్లకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్న రాయలసీమ వాసుల సృహదయత, సంస్కారం ఆ నినాదంలో ప్రతిబింబిస్తోందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతోంది.
రాయలసీమకు వెళితే రాళ్లేస్తారని, వేయాలని కోరుకున్న పాదయాత్రికులకు… అందుకు భిన్నంగా మంచి మాటలతో స్వాగతం పలకడం కొందరికి జీర్ణించుకోలేనిదే. దటీజ్ తిరుపతి.