పది మంది అంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ!

'తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీరులో మార్పురావాలి.. లేకపోతే 23 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న ఆయన పార్టీ బలం 13 మందికి పడిపోగలదు. ఆయన నాయకత్వాన్ని ఆయన పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించే అవకాశాలున్నాయి..' అంటూ…

'తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీరులో మార్పురావాలి.. లేకపోతే 23 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న ఆయన పార్టీ బలం 13 మందికి పడిపోగలదు. ఆయన నాయకత్వాన్ని ఆయన పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించే అవకాశాలున్నాయి..' అంటూ అసెంబ్లీలో హితబోధ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

సీఎం జగన్ నిర్ణయాలను, హామీల అమలును అభినందించాలని… అలాకాకుండా తెలుగుదేశం పార్టీ గతంలాగానే వ్యవహరిస్తే ప్రజలు మరింతగా అసహ్యించుకుంటారని అంబటి అన్నారు. తెలుగుదేశం పార్టీ తీరును ప్రజలు అసహ్యించుకునే అధికారం నుంచి దించేసి, కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ బలాన్ని వారు పరిమితం చేశారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేతను, ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరును చూస్తుంటే పరమానందయ్య శిష్యులు గుర్తుకు వస్తున్నారని, వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు తన తీరును మార్చుకోవాలని, లేకపోతే ఉన్న వారిలో కూడా పదిమంది బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని అన్నారు.

మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బలం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాట్ కామెంట్స్ కోనసాగిస్తూ ఉంది. ఎనిమిది మంది, పది మంది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఎవరు వచ్చిచేరినా వారిచేత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించడం అని మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటున్నారు.

మరి ఎవరైనా వస్తారో రారో కానీ.. ఎనిమిది మంది, పది మంది అంటూ.. తెలుగుదేశం వర్గాల్లో ఆందోళన మాత్రం రేకెత్తించే గేమ్ ప్లాన్ కు అనుగుణంగా మాట్లాడుతున్నారని మాత్రం స్పష్టం అవుతోంది!

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!