ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి స్వయంగా వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాజధాని ప్రాంతంలో జగన్ అధికార నివాసానికి వెళ్లి ఆహ్వానించారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా కేసీఆర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఇక ఆహ్వానించడానికి వచ్చిన కేసీఆర్ కు స్వయంగా స్వాగతం పలికారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్ లకు సాదర స్వాగతం పలికారు జగన్ మోహన్ రెడ్డి. వారికి భోజన ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి నివాసంలోనే జరిగినట్టుగా తెలుస్తోంది.
ఈ సమావేశం సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఐదేళ్ల నుంచి పెండింగ్ లోని సమస్యల గురించి చర్చించినట్టుగా సమాచారం. విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని అంశాల మీద చర్చించారట.
విభజన చట్టంలోని పెండిండ్ అంశాలన్నింటినీ పరిష్కరించడమే కేసీఆర్, జగన్ లు లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరుకావడం కూడా లాంఛనమే కావొచ్చు.