Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రఫ్‌

సినిమా రివ్యూ: రఫ్‌

రివ్యూ: రఫ్‌
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: ఆది, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రీహరి, రఘుబాబు, శివారెడ్డి, అజయ్‌, తనికెళ్ళ భరణి, సుహాసిని తదితరులు
మాటలు: మరుధూరి రాజా
సంగీతం: మణిశర్మ
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్‌ కుమార్‌
నిర్మాత: అభిలాష్‌ మాధవరం
కథ, కథనం, దర్శకత్వం: సి.హెచ్‌. సుబ్బారెడ్డి
విడుదల తేదీ: నవంబర్‌ 28, 2014

‘ప్రేమ కావాలి’, ‘లవ్‌లీ’ చిత్రాలతో కెరీర్‌కి స్మూత్‌ టేకాఫ్‌ దక్కినా కానీ ఆ తర్వాత ఆది జర్నీ మాత్రం ‘రఫ్‌’గానే సాగుతోంది. ‘సుకుమారుడు’, ‘ప్యార్‌ మే పడిపోయానే’, ‘గాలిపటం’లాంటి వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న ఆది ఈసారి పంథా మార్చి పూర్తి స్థాయి మాస్‌ హీరోగా అవతరించాడు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో, పంచ్‌ డైలాగులతో రఫ్‌ అండ్‌ టఫ్‌ అనిపించుకునే ఎటెంప్ట్‌ చేసాడు. 

కథేంటి?

నందిని (రకుల్‌) దయా గుణం నచ్చి ఆమె ప్రేమలో పడతాడు చందు (ఆది). నందిని అన్నయ్య సిద్ధార్థ్‌కి (శ్రీహరి) ముందుగా తన ప్రేమ గురించి చెప్పి, తన చెల్లిని ప్రేమలోకి దించుతానని ఛాలెంజ్‌ చేస్తాడు చందు. నందినితో స్నేహం చేస్తూ, మరోవైపు నందిని తన ప్రేమలో పడిపోయిందని సిద్ధార్థ్‌కి చెబుతూ డబుల్‌ గేమ్‌ ఆడుతుంటాడు. చందు హంతకుడని, చిన్నప్పుడే జైలుకి వెళ్లి వచ్చాడని సిద్ధార్థ్‌కి తెలుస్తుంది. 

కళాకారుల పనితీరు:

ఆది సాఫ్ట్‌ క్యారెక్టర్స్‌ని పక్కన పెట్టి ఈసారి టఫ్‌గా కనిపించడానికి బాగా కష్టపడ్డాడు. బాడీ అయితే పెంచాడు కానీ అతనికి మాస్‌ డైలాగులు, భారీ ఫైట్లు సూట్‌ కాలేదు. ‘సముద్రంలోంచి శంఖాలు కాదురా.. శవాలు లేస్తాయి’ వంటి డైలాగులు చెప్పడం ఏమాత్రం ఆకట్టుకోదు. మాస్‌ని ఆకట్టుకోవడం కోసం ఆది తొందరపడ్డాడేమో అనిపిస్తుంది. అతను ఇలాంటి పాత్రలు చేయడానికి ఇంకా చాలా టైముంది. ప్రస్తుతానికి లవర్‌బాయ్‌ క్యారెక్టర్స్‌కి పరిమితమైతే బెటర్‌. 

Watch Rough Movie Public Talk

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంత పాపులర్‌ కాకముందు చేసిన చిత్రమంట ఇది. ఆమెకి ఇప్పుడున్న పాపులారిటీ ఈ చిత్రానికి హెల్ప్‌ అవుతుంది. దివంగత నటుడు శ్రీహరి క్యారెక్టరైజేషన్‌ బాలేదు. అతని క్యారెక్టర్‌ని సీరియస్‌గా తీసుకోవాలో, కామెడీ అనుకోవాలో అర్థం కాకుండా తయారు చేసారు. రఘుబాబు కామెడీ ఎప్పటిలానే అతిగా అనిపించింది. శివారెడ్డికి బదులుగా నోటెడ్‌ కమెడియన్‌ని పెట్టి ఉంటే ఆ క్యారెక్టర్‌ కామెడీకి పనికొచ్చేది. 

సాంకేతిక వర్గం పనితీరు:    

మణిశర్మ కంపోజ్‌ చేసిన పాటలు క్యాచీగా లేవు కానీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పరంగా తన ప్రత్యేకత చాటుకున్నాడు మెలోడీ బ్రహ్మ. సెంథిల్‌ సినిమాటోగ్రఫీ యాక్షన్‌ సీన్స్‌లో హైలైట్‌గా నిలిచింది. సినిమా నిండా పంచ్‌ డైలాగులు ఉన్నాయి కానీ ఏవీ పేలలేదు. డైరెక్టర్‌ సుబ్బారెడ్డి ఏనాడో పక్కన పడేసిన ఆరు ఫైట్లు, ఆరు పాటల టెంప్లేట్‌ని తీసుకుని కమర్షియల్‌ సినిమా తెరకెక్కించాడు. మేటర్‌ లేని కథకి అతను రాసుకున్న కథనం కూడా ఆసక్తి కలిగించలేదు. అదే పనిగా ఫైట్లు పెట్టేసి జనాన్ని ఆకట్టుకునే రోజులు ఏనాడో పోయాయి. బిల్డప్‌ షాట్లు, యాక్షన్‌ సీన్లు మినహా సుబ్బారెడ్డి దేనిపైన ఎక్కువ కాన్సన్‌ట్రేట్‌ చేయలేదు. 

హైలైట్స్‌:

  • రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

డ్రాబ్యాక్స్‌:

  • విషయం లేని కథ
  • ఆకట్టుకోని కథనం
  • విసిగించే ద్వితీయార్థం

విశ్లేషణ:

‘‘లాగి కొడితే అంతెత్తు ఎగిరి పడతాడండీ...’’ లాంటి పాయింట్లు మినహా హీరోకి స్టోరీ నెరేట్‌ చేసేటప్పుడు ఎక్సయిట్‌ చేసే ఎలిమెంట్స్‌ ఏమీ లేవిందులో. ప్రతి హీరోకీ ఏదో ఒక పాయింట్‌లో లార్జర్‌ దేన్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ చేయాలనే సరదా ఉంటుంది. ఆది సరదా పడి చేసిన ఈ సోకాల్డ్‌ కమర్షియల్‌ సినిమాలో ఆరు పాటలు, అరడజను ఫైట్లు ఉన్నాయి. వాటి మధ్య నామ్‌ కే వాస్తేగా ఏదో కథ నడుస్తుంటుంది. హీరోయిన్‌ సైడు నుంచి బ్రదర్‌ సెంటిమెంటు, హీరో సైడు నుంచి సిస్టర్‌ సెంటిమెంటు జోడించి... హీరోయిన్‌ బ్రదర్‌కి, హీరోకీ మధ్య క్లాష్‌ సృష్టించి రెండున్నర గంటల పాటు సినిమా చూపించేసారు. 

ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి కదా, ఇంకా ఇలాంటివి చూస్తారంటారా, పైసా వసూల్‌ అనిపించే ఎలిమెంట్స్‌ ఏమీ లేవు కదా.. లాంటి క్వశ్చన్స్‌ కనుక స్క్రిప్ట్‌ స్టేజ్‌లోనే రైజ్‌ అయి ఉంటే ఈ ‘రఫ్‌’ స్క్రిప్ట్‌ ఒక ఫీచర్‌ ఫిల్మ్‌ అయి ఉండేది కాదు. ఫలానా ఒక అంశం బాగుంది, ఇందుకోసం ఈ సినిమా చూడొచ్చు అనిపించే సందర్భం ఒక్కటీ లేదు. కథలో విషయం లేకపోవడం, కథనంలో ఆసక్తి కలిగించే అంశాలు లేకపోవడం, అవసరానికి మించిన ఫైట్లుండడం, పాటలు బోర్‌ కొట్టించడం... అన్నిటికీ మించి ఇలాంటి కథకి తగ్గ హీరో లేకపోవడం.. ఇన్ని మైనస్‌లు ఒకే సినిమాలో ఉంటే ఇక అది ఎలా గట్టెక్కడం?

గోపీచంద్‌ లాంటి మాస్‌ హీరోలే ఈ తరహా కథలకి తిలోదకాలిచ్చేసి కామెడీని నమ్ముకుంటోన్న టైమ్‌లో ఆదిలాంటోళ్లు అటెళ్లాల్సిన అవసరం లేదు. కొన్నిటిని స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిన పని లేదు. ఇంతకుముందు ఇవే తప్పులు చేసిన వారి అనుభవాల నుంచీ నేర్చుకోవచ్చు. కరువు తీరిపోయేటన్ని ఫైట్లు, అక్కడక్కడా నవ్వించే నాలుగు జోకులు, రెండు బిల్డప్‌ షాట్లు, ఒక అందమైన హీరోయిన్నూ ఉంటే అంతకంటే ఏమక్కర్లేదనే బాపతు ప్రేక్షకులకి తప్ప మిగిలిన వారికి రఫ్‌ చాలా టఫ్‌గా తోస్తుంది. ట్రెయిలర్స్‌ దగ్గర్నుంచి పోస్టర్స్‌ వరకు అన్నిట్లోను ఈ సినిమా ఎలాగుంటుందనేది క్లియర్‌గా చూపించేసినా దీంట్లో కొత్తదనం ఉంటుందని వెళితే తప్పు మనదే అవుతుంది. 

బోటమ్‌ లైన్‌: రఫ్ఫాడించారు!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?