బాలయ్య మళ్లీ సెట్ పైకి

తన తాజా సినిమా షూటింగ్ లో హీరో బాలకృష్ణ స్వల్పంగా గాయపడని సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, కర్ర సాయంతో సిన్సియర్ గా అసెంబ్లీకి కూడా హాజరైన బాలయ్య ఇప్పుడు అంతే సిన్సియర్…

తన తాజా సినిమా షూటింగ్ లో హీరో బాలకృష్ణ స్వల్పంగా గాయపడని సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, కర్ర సాయంతో సిన్సియర్ గా అసెంబ్లీకి కూడా హాజరైన బాలయ్య ఇప్పుడు అంతే సిన్సియర్ గా షూటింగ్ కు కూడా వచ్చేసారు. శుక్రవారం కొన్ని సన్నివేశాలు ఆర్ఎఫ్ సి లో చిత్రీకరించారు. 

వాటిలో ఎమ్ ఎస్ నారాయణ కాంబినేషన్ లో కామెడీ సీన్లు కూడా వున్నాయి. కొత్త దర్శకుడు సత్యదేవ్ ఈ సినిమాకు దర్శకుడు. లెజెండ్ తరువాత వైవిధ్యమైన కథతో బాలయ్య చేస్తున్న సినిమా ఇది. గతంలో గ్రీన్ సిగ్నల్ సినిమాను నిర్మించిన రుద్రపాట రమణారావు దీనికి నిర్మాత