బాహబలి శాటిలైట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. నిర్మాతలు చాలా భారీ డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. అందులో ఒకటి రెండు భాగాలు కలిపి కొనాలన్నది ఒక డిమాండ్., ఆ టోటల్ ప్యాకేజీ ధర పాతిక కోట్లు అన్నది మరో డిమాండ్. ప్రస్తుతం జీ, జెమిని, మా టీవీలు శాటిలైట్ హక్కుల కొనుగోళ్లలో ముందున్నాయి. కానీ జీ టీవీ ఇటీవల ఆ పోటీలో కాస్త వెనుక బడింది. జెమిని ముందుంది.
అయితే బాహుబలి విషయంలో మాటీవీ కాస్త ముందడుగు వేసినట్లు సమాచారం. రెండు పార్టులు కలిపి ఒకేసారి అగ్రిమెంట్ చేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పేసింది. కానీ రేటు దగ్గర మెలిక పడింది. పాతిక కోట్లు అంటే ఒక్కోటి పన్నెండున్నర కోట్లు. అది కాస్త భారీ మొత్తమే. లాంగ్ రన్ లో కానీ తేరుకోవడం కష్టం.
పైగా మొదటి భాగం తరువాత రెండో భాగం వ్యవహారం ఎలా వుంటుందో తెలియదు.దానికి కూడా మొదటి భాగంతో సమానంగా పే చేయాలి అంటే కాస్త ఆలోచించాలి. అందుకే ఈ విషయమై డిస్కషన్లు నడుస్తున్నట్లు సమాచారం