వరుణ్‌కి మెగా ప్రిన్స్‌.. ఓకేనా.?

ప్రిన్స్‌ అంటే తెలుగు సినీ పరిశ్రమలో మహేష్‌ పేరే గుర్తుకొస్తుంది. అయితే ఇప్పుడు మహేష్‌ సూపర్‌ స్టార్‌గా చెలామణీ అవుతున్న విషయం విదితమే. అందుకేనేమో, చిరంజీవి తన సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజకి…

ప్రిన్స్‌ అంటే తెలుగు సినీ పరిశ్రమలో మహేష్‌ పేరే గుర్తుకొస్తుంది. అయితే ఇప్పుడు మహేష్‌ సూపర్‌ స్టార్‌గా చెలామణీ అవుతున్న విషయం విదితమే. అందుకేనేమో, చిరంజీవి తన సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజకి ‘మెగా ప్రిన్స్‌’ అనే బిరుదును ఇచ్చేశారు. గతంలో అల్లు అర్జున్‌కి ‘స్టైలిష్‌ స్టార్‌’ అని బిరుదును ఇచ్చింది కూడా చిరంజీవే.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ప్రస్తుత తరం మెగా హీరోల్లో (పవన్‌కళ్యాణ్‌ కాకుండా) వరుణ్‌ తేజ అందగాడు. ‘మెగా అందగాడు’గా ఇప్పటికే అభిమానుల నుంచీ, ఇండస్ట్రీ నుంచీ కితాబులందుకున్న వరుణ్‌ తేజ, ‘ముకుంద’ సినిమాతో ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తాడోగానీ, ఇప్పటికైతే సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే నెలకొన్నాయి ఈ సినిమాపై.

ఇక, ‘మెగా ప్రిన్స్‌’ బిరుదుని తొలి సినిమా విడుదలకు ముందే అందుకోవడం వరుణ్‌ స్పెషాలిటీ. పెర్ఫామెన్స్‌ పరంగా, డాన్సుల పరంగా.. సినిమా విడుదలవకముందే ప్రశంసలు అందుకుంటున్న వరుణ్‌, ‘ముకుంద’ సినిమాపై వున్న అంచనాలన్నిటినీ స్వయంగా మోయాల్సి వుంటుంది. ఈ స్థాయి హైప్‌ వచ్చాక, ‘ముకుంద’ ఏ రేంజ్‌ సక్సెస్‌ అయితేగానీ వరుణ్‌కి ‘మెగా ప్రిన్స్‌’ అనే పేరుకు తగ్గ గుర్తింపు వస్తుందంటారు.?

మరోపక్క, మెగా ఫాన్స్‌ తొలుత ‘మెగా ప్రిన్స్‌’ బిరుదుని వినగానే కొంచెం గందరగోళంగా కన్పించినా, కొంచెం కొంచెంగా ఆ బిరుదుని అలవాటు చేసేసుకుంటున్నారు. సినిమా రిలీజ్‌ టైమ్‌కి మెగా ఫాన్స్‌ మెగా ప్రిన్స్‌ పేరుతో హంగామా చేయడానికి షురూ అవుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!