బాబాయ్‌ సంగతి సరే.. అబ్బాయి బాగా పాడతాడుగా..!

‘మేముసైతం’ ప్రోగ్రామ్‌లో నందమూరి నటసింహం బాలయ్యబాబు పాడిన పాటలు ఇప్పుడు పెద్ద హడావిడి చేస్తున్నాయి. ఆయన పాట విని నవ్వుకోలేనివాళ్ళు లేరంటే విడ్డూరం కాదు. ఆయన గాత్రం ఎలా వున్నా, ఆసాంతం పాటని టైమింగ్‌లో…

‘మేముసైతం’ ప్రోగ్రామ్‌లో నందమూరి నటసింహం బాలయ్యబాబు పాడిన పాటలు ఇప్పుడు పెద్ద హడావిడి చేస్తున్నాయి. ఆయన పాట విని నవ్వుకోలేనివాళ్ళు లేరంటే విడ్డూరం కాదు. ఆయన గాత్రం ఎలా వున్నా, ఆసాంతం పాటని టైమింగ్‌లో పాడేసి సెహబ్బాస్‌ అనిపించాడు. పాటతోపాటు ఆయన చూపించిన హావభావాలు కూడా ఎంతో ఫన్‌ని అందించాయి. 

అయితే ఎన్టీఆర్‌ ఖాన్‌దాన్‌లో పాటలు పాడేవాళ్ళు లేరన్న లోటుని జూనియర్‌ ఎన్టీఆర్‌ తీర్చేశాడు. ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్‌ పాడిన ‘ఓలమ్మి తిక్కరేగిందా..’ పాట సూపర్‌ హిట్‌. బాగా పాడాడని ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఇటీవల ‘రభస’ సినిమాలో ‘రాకాసి.. రాకాసి’ అంటూ పాడి మళ్ళీ తనలోని గాయకుడిని ఆవిష్కరించాడు. ‘మేముసైతం’ ప్రోగ్రామ్‌లో ఎన్టీఆర్‌తో ఆ రెండు పాటలు పాడిస్తే ఇంకెంతో మైలేజ్‌ వచ్చి వుండేదని అన్నవాళ్ళు లేకపోలేదు. 

బాలకృష్ణ పాడిన పాటల్లో ఎంతో కిక్‌ వుంది. దాన్ని అందరూ విని రసానుభూతికీ, రకరకాల వికారాలకూ లోనయ్యారు. ఎన్టీఆర్‌కి జ్వరం కారణంగా, ‘మేముసైతం’ ప్రోగ్రామ్‌లో జస్ట్‌ కనిపించాడంతే. అది కూడా క్రికెట్‌ పోటీ జరుగుతున్నప్పుడే. మొత్తమ్మీద బాలయ్యబాబు స్టేజి మీద పాటలు పాడి ప్రూవ్‌ చేసుకున్నాడు కాబట్టి, తన చిత్రాల్లో ఆయన సొంత గొంతుతో పాటలు పాడే రోజులు కూడా వస్తాయేమో.