జెడి మళ్లీ విలన్

చిన్న వేషాల నుంచి హీరోగా, ఆపై డైరక్టర్ గా అవతారాలెత్తి, ఆఖరికి అప్పుడప్పుడు విలన్ గా మాత్రం దర్శనమిస్తున్నాడు జెడి చక్రవర్తి. కానీ టైమ్ మాత్రం కలిసిరావడం లేదు. ఎలాంటి  వేషమసినా,, ఏ సినిమా…

చిన్న వేషాల నుంచి హీరోగా, ఆపై డైరక్టర్ గా అవతారాలెత్తి, ఆఖరికి అప్పుడప్పుడు విలన్ గా మాత్రం దర్శనమిస్తున్నాడు జెడి చక్రవర్తి. కానీ టైమ్ మాత్రం కలిసిరావడం లేదు. ఎలాంటి  వేషమసినా,, ఏ సినిమా తీసినా ఫలితం శూన్యం. అయినా కాస్త వైవిధ్యమైన పాత్ర వస్తే, దర్శకులకు జేడి గుర్తుకువస్తాడు. 

ఇప్పుడు జెడికి మళ్లీ నెగిటివ్ రోల్ ఒకటి వచ్చింది.అయితే తెలుగులో కాదు. మలయాళంలో. అదీ టాప్ సీడ్ హీరోయిన్ నయనతార పక్కన. ఆమె ప్రేమికుడిగా..కానీ నెగిటివ్ క్యారెక్టర్ తో. ఏమాత్రం బాగున్నా మనవాళ్లు తెలుగులోకి తెస్తారు కాబట్టి..మరోసారి జెడిని మనం కూడా నెగిటివ్ రోల్ లో చూడొచ్చు.