సమంతాకే ఎందుకో ఈ కష్టాలు

పాపం ఈ మధ్య సమంత టైమ్ అంత బాగున్నట్లు లేదు. అసలే హిట్ అవుతుందని, తన ఒళ్లు దాచుకోకుండా కష్టపడిన అంజాన్ (సికిందర్) ఫ్లాప్ కావడం, విజయ్..కత్తి హిట్ అయినా, తనకు ఏ మాత్రం…

పాపం ఈ మధ్య సమంత టైమ్ అంత బాగున్నట్లు లేదు. అసలే హిట్ అవుతుందని, తన ఒళ్లు దాచుకోకుండా కష్టపడిన అంజాన్ (సికిందర్) ఫ్లాప్ కావడం, విజయ్..కత్తి హిట్ అయినా, తనకు ఏ మాత్రం క్రెడిట్ దక్కక పోవడం, వెబ్ సైట్లలో ఏదో ఒక వార్త ఆమెపై రావడం ఇలా ఒకటి కాదు సమస్యలు. 

ఇప్పుడు మరోసారి తలకాయనొప్పి వచ్చి పడింది. కోలీవుడ్ వెబ్ సైట్లలో సమంత డ్రెస్ చేంజ్ చేసుకుంటూ, మధ్యలో ఫోన్ మాట్లాడుతున్న ఫొటోలు దర్శనమిచ్చాయి. ఆ వెంటనే ఆ ఫొటోలు అయితే పీకేయించారు. అంజాన్ యూనిట్ సభ్యుడెవరో పెన కెమేరాతో వాటిని చిత్రీకరించారని టాక్. 

ఆ వ్యవహారం అలా వుండగానే తెలుగు సైట్లు అన్నీ ఫొటో దొరికినా దొరక్కున్నా, వార్తను మాత్రం జనాలకు అందించేసాయి.దాంతో జనం గూగల్ సముద్రాన్ని జల్లెడ పట్టడం ప్రారంభించారు. కేవలం నాలుగు వేల రూపాయల కోసం యూనిట్ సభ్యుడు ఒకరు ఈ ఫోటోలను తమిళ వెబ్ సైట్లకు అమ్మేసారని అంటున్నారు. 

దీనిపై సమంత సీరియస్ గా వుందని, ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదని తెలుస్తోంది.