మిర్చి భామ‌తో.. మెగా హీరో!

ముకుందతో సినిమాల్లోకి వచ్చిన మెగా ఫ్యామిలీ  హీరో వ‌రుణ్ తేజ్‌ – క్రిష్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌ 27న ఈ చిత్రానికి క్లాప్ కొడ‌తారు.  వ‌రుణ్ తేజ్…

ముకుందతో సినిమాల్లోకి వచ్చిన మెగా ఫ్యామిలీ  హీరో వ‌రుణ్ తేజ్‌ – క్రిష్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌ 27న ఈ చిత్రానికి క్లాప్ కొడ‌తారు.  వ‌రుణ్ తేజ్ పక్కన క‌థానాయిక‌గా ఓ మోడ‌ల్‌ని ఎంచుకొన్నారు. 

ఆమే… ప్రగ్యా జైస్వాల్‌. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఈ అమ్మాయి.. మోడ‌ల్ కూడా. న‌టిగానూ అనుభ‌వం ఉంది. అభిజిత్ (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్‌) సినిమా మిర్చిలాంటి కుర్రాడు సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఆ సినిమా ఇంకా విడుద‌ల కాక‌మునుపే.. మెగా హీరోతో న‌టించే ఛాన్స్ అందుకొంది. అంటే లక్కీ గర్ల్ అన్నమాటే.