ఎన్టీఆర్‌కి అదే టైటిల్‌ ఫిక్సయింది

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా చిత్రం టైటిల్స్‌ అంటూ చాలానే ప్రచారంలోకి వచ్చాయి. ‘నేనో రకం’ టైటిల్‌ ఖరారైందని వార్తలు కూడా వచ్చేసాయి. అయితే ఫైనల్‌గా ‘టెంపర్‌’ అనే టైటిల్‌కి ఈ చిత్ర బృందం…

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా చిత్రం టైటిల్స్‌ అంటూ చాలానే ప్రచారంలోకి వచ్చాయి. ‘నేనో రకం’ టైటిల్‌ ఖరారైందని వార్తలు కూడా వచ్చేసాయి. అయితే ఫైనల్‌గా ‘టెంపర్‌’ అనే టైటిల్‌కి ఈ చిత్ర బృందం ఓటేసింది. ప్రచారంలో ఉన్న టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. 

ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌కి ఈ టైటిల్‌ అయితే బాగా సూట్‌ అవుతుందని ‘టెంపర్‌’ టైటిల్‌ని ఖరారు చేసారు. మాస్‌ అప్పీల్‌ ఉండడంతో పాటు క్యాచీగా ఉంది కనుక దీనికి రీచ్‌ బాగుంటుందని అనుకుంటున్నారు. టైటిల్‌ లోగోతో సహా ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ డిజైన్స్‌ కాసేపట్లో మీడియాలో దర్శనమిస్తాయి. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. అతని సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.