బిబిఎమ్ రీమేక్ కు ఫ్రభుదేవా

భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ అయిపోయింది. పాతిక కోట్ల సినిమాగా మారింది. అందంతా నిన్నటి మాట. ఇప్పుడు రేపటి సంగతేమిటి? బాలీవుడ్ లో రీమేక్ చేస్తారా? చేస్తారనే వార్తలు వినవస్తున్నాయి. మారుతి బాలీవుడ్…

భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ అయిపోయింది. పాతిక కోట్ల సినిమాగా మారింది. అందంతా నిన్నటి మాట. ఇప్పుడు రేపటి సంగతేమిటి? బాలీవుడ్ లో రీమేక్ చేస్తారా? చేస్తారనే వార్తలు వినవస్తున్నాయి. మారుతి బాలీవుడ్ కు వెళ్తాడని కూడా మీడియాలో వార్తలు వినవచ్చేసాయి. 

కానీ విషయం వేరుగా వుంది. సౌత్ సినిమాలను నార్త్ కు తీసుకెళ్లి విజయాలు సాధించే డైరక్టర్లలో ఒకడైన ఫ్రభుదేవా ఇప్పుడు బిబిఎమ్ పై కన్నేసారు. ఆల్రెడీ బిబిఎమ్ ను స్పెషల్ గా చూసారు. బాలీవుడ్ కు తీసుకెళ్లాలని డిసైడ్ అయిపోయారు. 

అయితే మరి హక్కులు తీసుకుని, ఎవరైనా నిర్మాతతో చేస్తారా? లేక అరవింద్ నే చేస్తారా? ఇలాంటి వ్యవహారాలు అన్నీ ఫైనల్ కావాల్సి వుంది. తెలుగు సినిమా హడావుడి తగ్గి, లెక్కలు, సెటిల్ మెంట్లు పూర్తి కాగానే హిందీ వ్యవహారం మొదలవుతుంది. మారుతి చేయడం లేదన్నది మాత్రం గ్యారంటీ.