రకుల్ బాగా పెంచేసిందట

రకుల్ ప్రీత్ సింగ్…ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ సీడ్. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ లతో మూడు సినిమాలు చేస్తోంది. ఏ హీరో అయినా, రకుల్ ను ట్రయ్ చేయండి అనే చెబుతున్నాడట నిర్మాతలకు,…

రకుల్ ప్రీత్ సింగ్…ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ సీడ్. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ లతో మూడు సినిమాలు చేస్తోంది. ఏ హీరో అయినా, రకుల్ ను ట్రయ్ చేయండి అనే చెబుతున్నాడట నిర్మాతలకు, దర్శకులకు. ఆ  అమ్మాయి కూడా అవకాశం ఇవ్వాలే కానీ, రెచ్చిపోయి నటించడానికి రెడీ. అందుకే టాలీవుడ్ జనం కూడా రకుల్ నామ జపం చేస్తున్నారు.

అందుకే, తన డిమాండ్ గమనించి తన రేటుకు కాస్త పైనే వుంచిందట రకుల్. కోటి ముఫై లక్షలకు తక్కువైతే నో..అని చెప్పేస్తోందట. దాంతో జనాలు ఆల్టర్ నేటివ్ ల కోసం వెదుకుతున్నారు. అందుకే ఇరవై  నుంచి ముఫై లక్షల్లో వచ్చే అనుపమ పరమేశ్వరన్ కు (ప్రేమమ్ మలయాళ సినిమా హీరోయిన్)కు టక్కున మూడు చాన్స్ లు పడ్డాయి.

ఇప్పుడు ఇంకా ఇలా ఎవరు వున్నారో అని గాలిస్తున్నారట. పెద్ద సినిమాలు, ఖర్చు కు రెడీ అయ్యే సినిమాలు మరీ అవసరం అనుకుంటే రకుల్ కు కోటి ముఫై లక్షలు చెల్లిస్తాయి. అయినా దీపం వుండగా ఇల్లు చక్కబెట్టుకోవడం, డిమాండ్ వుండగా డబ్బు చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి.