పూరి- చిరు- ఆటోజానీ?

ఫిల్మ్ చాంబర్ లో పూరి రిజిస్టర్ చేసిన ఆటో జానీ పేరు ఇప్పుడు కాస్త హడావుడి చేస్తోంది. ఈ టైటిల్ ఎవరికోసం రిజిస్టర్ చేయించినట్లు? మెగాస్టార్ రౌడీ అల్లుడు సినిమాలో హీరో పేరు ఆటో…

ఫిల్మ్ చాంబర్ లో పూరి రిజిస్టర్ చేసిన ఆటో జానీ పేరు ఇప్పుడు కాస్త హడావుడి చేస్తోంది. ఈ టైటిల్ ఎవరికోసం రిజిస్టర్ చేయించినట్లు? మెగాస్టార్ రౌడీ అల్లుడు సినిమాలో హీరో పేరు ఆటో జానీ. అందువల్ల మెగా క్యాంప్ కోసమే ఈ టైటిల్ అయి వుంటుందని ఓ ఊహాగానం. 

మెగాస్టార్ 150 వ సినిమా పూరి చేస్తున్నాడని టాక్ బయటకు వచ్చింది కాబట్టి, దానికే అయి వుంటుందని మరో గుసగుస. గుసగుసల సంగతి ఎలా వున్నా ఈ టైటిల్ మాత్రం మాంచి మాస్ మసాలా సినిమాకు పక్కాగా సరిపోతుందన్నది వాస్తవం. 

బివిఎస్ రవి, పరుచూరి సోదరులు కలిసి మెగాస్టార్ కోసం స్క్రిప్ట్ వండి వార్చారు. దానికి మరి ఈ టైటిల్ సూటవుతుందా అన్నది వారికే తెలియాలి. ఏదైనా ఒక్కక్కటీ మరిన్ని విశేషాలు కొన్ని రోజుల్లో బయటకు వస్తాయి.