వరల్డ్‌ కప్‌లో తొలి డబుల్‌ సెంచరీ

వరల్డ్‌ కప్‌లో తొలి డబుల్‌ సెంచరీ నమోదయ్యింది. వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ బౌండరీలతో, సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 138 బంతుల్లో 10 బౌండరీలు, 16 సిక్సర్ల సహాయంతో డబుల్‌ సెంచరీ బాదాడు…

వరల్డ్‌ కప్‌లో తొలి డబుల్‌ సెంచరీ నమోదయ్యింది. వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ బౌండరీలతో, సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 138 బంతుల్లో 10 బౌండరీలు, 16 సిక్సర్ల సహాయంతో డబుల్‌ సెంచరీ బాదాడు క్రిస్‌ గేల్‌. మొదట నెమ్మదిగా బ్యాటింగ్‌ ప్రారంభించిన క్రిస్‌గేల్‌, క్రమక్రమంగా తనదైన స్టయిల్లో మైదానంలో వీరవిహారం చేశాడనే చెప్పాలి.

వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలి డబుల్‌ సెంచరీని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ నమోదు చేసిన విషయం విదితమే. ఆ తర్వాత వీరేందర్‌ సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీలు చేశారు. నిన్నటిదాకా కేవలం భారత ఆటగాళ్ళకే పరిమితమయ్యింది వన్డే డబుల్‌ సెంచరీ. ఇప్పుడు ‘డబుల్‌’ లిస్ట్‌లో క్రిస్‌గేల్‌ చేరిపోయాడు.

టెస్టులైనా, వన్డేలైనా, టీ 20 మ్యాచ్‌లైనా.. క్రిస్‌గేల్‌ విరుచుకుపడ్డాడంటే మైదానంలో సిక్సర్ల మోత మోగాల్సిందే. ఐపీఎల్‌ మొనగాడుగా క్రిస్‌గేల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఎన్నో ఆడేశాడు. వరల్డ్‌ కప్‌ పోటీల్లో క్రిస్‌గేల్‌ ఈ స్థాయిలో విరుచుకుపడటం వెస్టిండీస్‌ క్రికెట్‌ అభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తింది.