Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వేసవి వేడిలో కిక్ 2

వేసవి వేడిలో కిక్ 2

వేసవి సెలవులను క్యాష్ చేసుకోవడానికి టాలీవుడ్ పెద్ద సినిమాలు అన్నీ రెడీ అయిపోతున్నాయి. రుద్రమదేవి, బాహుబలి, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా జాబితా చాలా పెద్దదే వుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో కిక్ 2 కూడా చేరిపోయింది. ర‌వితేజ - సురేంద‌ర్‌రెడ్డిలు ఇచ్చిన కిక్ అప్పట్లో ఓ పెద్ద హిట్. దానికి సీక్వెల్ నిర్మిస్తున్నాడు పటాస్ కళ్యాణ్ రామ్.

ఇలియానా లేదు తప్ప, మిగిలిన టీమ్ అంతా అలాగే వుంది.  దాదాపు టాకీ పార్ట్ పూర్తి కావస్తున్న ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు సమాచారమ్. మే 9 వ తేదీని ముహుర్తంగా నిర్ణయించారు. అంతకు ముందు ఏప్రిల్ చివ‌రి వారంలో అడియో ఫంక్షన్ వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?