అసలు దాసరి, పవన్ సినిమా ఎలా ఫిక్సయింది. పవన్ ఎలా ఓకె చెప్పారు. ఇది నిజంగా పట్టాలెక్కుతుందా..ఇలా ఎన్నో అనుమానాలు.
ఎర్రబస్సు సినిమా డిజాస్టర్ ను దర్శకుడు దాసరి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. ఆయనకు దగ్గరగా వుండే జనాలు కూడా అదే చెబుతున్నారు. అస్సలు పెద్దాయిన ఊహించలేదు, ఆ సినిమా అలా అవుతుందని. కానీ ఫలితం అలా వుండడంతో, దాసరి దాదాపు ఇంట్లోనే వుంటున్నారు. బయటకు రావడం బాగా తగ్గించేసారు.
దాంతో ఓ సారి తానే కలుద్దామని పవన్ వారం క్రితం ఇంటికి వెళ్లారు. ఆరోగ్యం గురించి వాకబు చేసారు. అయిందేదో అయింది..మీరు ఇంకా సినిమాలు తీయాలి..మానేయకూడదు అన్నట్లు పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.
అలా ప్రారంభమైన మాటలు పవన్ తో సినిమా చేసే వరకు వెళ్లాయి.సోమవారం నాడు ఈ కాంబినేషన్ కు సంబంధించి కొన్ని చానెళ్లకు దాసరి కి దగ్గర వారి నుంచే ఫోన్ లో మౌఖికంగా వార్త అందింది. కేవలం దాసరి మీద గౌరవంతో, పవన్ ఓకె అన్నారని, అంతకు మించి మరేమీ లేదని వినికిడి.
అయితే ఇంతకూ ఈ సినిమాకు లైన్ అనుకోలేదు..దర్శకుడిని ఫిక్స్ చేయలేదు. పైగా పవన్ గబ్బర్ సింగ్ 2 చేయాల్సి వుంది. అది ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది చిలకప్రశ్న లాంటిది. అది కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది. అంటే మార్చిలో మొదలైనా, జూన్ జూలైల వరకు లాగేస్తుంది. పైగా పవన్ దగ్గరుంచి చూసుకునే ప్రాజెక్టు కాబట్టి, దసరాకు విడుదలైతే తప్ప, పవన్ ఫ్రీ కారు. ఆ తరువాత మాత్రమే ఆయన దాసరి ప్రాజెక్టుకు ఓకె అనొచ్చు. పైగా త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాల్సి వుంది.
మరి దాసరి సినిమాను త్రివిక్రమ్ కు అప్పగిస్తారా? లేక దాసరి ఇప్పటికే తన వారసుడు అని డిక్లేర్ చేసినందున పూరికి అప్పగిస్తారా అన్నది అనుమానం. పూరి దర్శకత్వంలో కెమేరామెన్ గంగతో రాంబాబు అనుభవం పవన్ కు వుంది. మరి ఆయన ఓకె అంటారా? ఇలా చాలా వున్నాయి. అందువల్ల ఫీలర్ విజయవంతంగా వదిలారు కానీ, సినిమా మాత్రం 2015లో ప్రారంభం అవుతుందా అంటే అనుమానమే?