పూరి మాట నిలబడుతోంది

టెంపర్ సక్సెస్ మీట్ లో నిర్మాత బండ్ల గణేష్ ఓ సీక్రెట్ వెల్లడించాడు. 'నీకు గబ్బర్ సింగ్ లాంటి మరో హిట్ కావాలా' అని పూరి అడిగాడని చెప్పాడు. ఎందుకు అక్కర్లేదు అని తను…

టెంపర్ సక్సెస్ మీట్ లో నిర్మాత బండ్ల గణేష్ ఓ సీక్రెట్ వెల్లడించాడు. 'నీకు గబ్బర్ సింగ్ లాంటి మరో హిట్ కావాలా' అని పూరి అడిగాడని చెప్పాడు. ఎందుకు అక్కర్లేదు అని తను బదులిచ్చానన్నాడు. ఆ విధంగా టెంపర్ తెరకెక్కింది. నిజానికి టెంపర్ స్వదేశంలో గబ్బర్ సింగ్ రికార్డులను అంతలా తిరగరాయలేకపోయినా, ఓవర్ సీస్ లో మాత్రం ఆ దిశగా అడుగులేస్తోంది. 

ఇప్పటికి ఓవర్ సీస్ లో టెంపర్ గబ్బర్ సింగ్ రికార్డుకు కేవలం పది, పన్నెండు వేల డాలర్ల దూరంలో వుంది. మరో ఒకటి రెండు రోజుల్లో దీన్ని అధిగమించే అవకాశం వుంది. ఆ మాటకు వస్తే ఈగ రికార్డుకు 50వేల డాలర్ల దూరంలో వుంది. మరో వీకెండ్ వరకు ఆగితే ఆ రికార్డును కూడా దాటేసే అవకాశం వుంది. అంటే ఆ విధంగా పూరి మాట నిలబడింది అనుకోవాలి.