మనోహరుడు ముస్తాబు

శంకర్ – విక్రమ్ ల కలయికలో తయారవుతున్న భారీ సినిమా ఐ. ఇది తెలుగులో మనోహరుడుగా వస్తున్న సంగతి తెలిసిందే. 120 కోట్ల భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమా దాదాపు రెడీ…

శంకర్ – విక్రమ్ ల కలయికలో తయారవుతున్న భారీ సినిమా ఐ. ఇది తెలుగులో మనోహరుడుగా వస్తున్న సంగతి తెలిసిందే. 120 కోట్ల భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమా దాదాపు రెడీ అయిపోయిందని, దీపావళికి ఓకేసారి తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదలకు రెడీ అవుతోందని చెన్నయ్ వర్గాల బోగట్టా. తమిళ నిర్మాణ సంస్థే తెలుగులో కూడా స్వయంగా విడుదల చేసుకుంటోంది. 

త్వరలో ట్రయిలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎమీజాక్సన్ కథానాయిక. పిసి శ్రీరామ్ తొలిసారి శంకర్ తో కలిసి పనిచేస్తున్నారు. చెన్నయ్ సినీ సర్కిల్ లో ఇటీవల ట్రయిలర్ చూసినవారు..సూపర్ అంటున్నారు. చాలా కాలమైంది తెలుగులో సరి అయిన డబ్బింగ్ సినిమా హిట్ కొట్టి. దీంతో ఆ గ్యాప్ ఫిల్ అవుతుందేమో?