వంద యూనిట్లు అనగా ఎంత?

వంద యూనిట్ల లోపు భారం లేదు…ఇదీ ఈనాడు దినపత్రిక పతాక శీర్షిక హెడ్డింగ్. అంతే కానీ అయిదు నుంచి ఆరు శాతం విద్యుత్ చార్జీల పెంపు అన్నది కాదు. కానీ అసలు వంద యూనిట్లు…

వంద యూనిట్ల లోపు భారం లేదు…ఇదీ ఈనాడు దినపత్రిక పతాక శీర్షిక హెడ్డింగ్. అంతే కానీ అయిదు నుంచి ఆరు శాతం విద్యుత్ చార్జీల పెంపు అన్నది కాదు. కానీ అసలు వంద యూనిట్లు అనగా ఎంత? అన్నది ఆలోచించాలి కదా? వంద యూనిట్లు అంటై అదేదో మహా గొప్ప విషయం అన్నట్లు చెబుతారేమిటి? 

ఇవ్వాళ ఇల్లు అనగా..లైటు, ఫ్యాను, టీవీ ఈ రెండు కచ్చితంగా వుండాల్సిందే కదా? ఇవి లేని ఇళ్లు వుంటాయా? ఇది కనీసపు క్యాటగిరీ. ఇక రెండో క్యాటగిరీకి పై మూడింటికి అదనంగా ఫ్రిజ్ చేరుతుంది. ఆ పై క్యాటగిరీల సంగతి వదిలేద్దాం. వారి బాధ వారు పడతారు. 

ఇల్లు అన్నాక రెండు, నుంచి మూడు లైట్లు, ఒక ఫ్యాను, ఒక టీవీ వుంటే నెలకు వంద యూనిట్లు దాటతాయా దాటవా? ట్యూబ్ లైట్ గంటకు యూనిట్ నుంచి రెండు యూనిట్లు ఖర్చు చేస్తుంది. సీలింగ్ ఫ్యాన్ కూడా అలాగే గంటకు ఒకటి నుంచి రెండు యూనిట్లు ఖర్చు చేస్తుంది. కలర్ టీవీదీ అదే తంతు. టీవీ కనీసం సగటున నాలుగు నుంచి ఆరు గంటలు చూస్తారని అంచనా. ఫ్యాన్ కనీసం పది గంటలన్నా వేసుకోవాల్సిన అవసరం వుంటుంది. లైట్ కనీసం మూడు నుంచి నాలుగు గంటలు. 

ఈ లెక్కన, ఇంత పొదుపుగా చూసుకుంటే వంద యూనిట్లు దాటిపోదా? మరి అందరూ ఈ చార్జీల పెంపు భారాన్ని భరించాల్సిందేగా? వంద యూనిట్ల లోపు అంటే అదేదో మహా వరం అన్నట్లు చెబుతారేమిటి మహాశయా?  పైగా పన్నెందు వందల కోట్ల భారం ప్రజలపై పడుతుంటే..దాన్ని శీర్షికలో విస్మరిస్తే ఎలా?