ప‌టాస్ కామెడీ ట్రాక్ ఫ్రమ్ ఆగ‌డు??

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిల‌చింది.. ప‌టాస్‌!  రొటీన్ క‌థే అయినా… ఆ క‌థ‌లో వినోదం మేళ‌వించిన తీరు అంద‌రికీ న‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా ''పార్థాయ‌. '' ఎపిసోడ్ న‌వ్వులు పంచింది. 801 అంబులెన్స్ చుట్టూ…

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిల‌చింది.. ప‌టాస్‌!  రొటీన్ క‌థే అయినా… ఆ క‌థ‌లో వినోదం మేళ‌వించిన తీరు అంద‌రికీ న‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా ''పార్థాయ‌. '' ఎపిసోడ్ న‌వ్వులు పంచింది. 801 అంబులెన్స్ చుట్టూ సాగిన ఈ ట్రాక్‌… ప‌టాస్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. 

అయితే ఈ ట్రాక్ కి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ ట్రాక్ 'ఆగ‌డు' కోసం రాసుకొంద‌ట‌. ఆ సినిమాకి అనిల్‌రావిపూడి ప‌నిచేశారు. మ‌హేష్ సినిమా కోసం శ్రీ‌నువైట్ల అండ్ కో త‌యారు చేసుకొన్న ప‌ది, ప‌దిహేను ట్రాకుల్లో ఇదొక‌టి. 

కానీ.. దాన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ప‌క్కన పెట్టారు. ఇప్పుడు ప‌టాస్ లో ఈ సీన్లు వాడుకొన్నారు. ప‌టాస్ విజ‌యానికి ఆగ‌డు కోసం ప‌క్కన పెట్టిన సీన్లే కీల‌కం అయ్యాయి. కానీ ఆగ‌డు ఫ్లాప్‌.. ప‌టాస్ హిట్. అదే తేడా.