నటుడు నాగార్జున తన మనసులో ఏదీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయని మీడియా అడిగితే చాలా చిత్రంగా సమాధానమిచ్చారు. మోడీ ప్రభుత్వం రావడం ఆనందమన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వస్తుందని ముందే ఊహించామన్నారు. సీమాంధ్రలో మాత్రం సర్వేలకు భిన్నమైన ఫలితం వచ్చిందన్నారు.
అంటే అర్థమేమిటి? బాబు అధికారంలోకి వస్తాడని అనుకోలేదనేగా. నాగార్జున కు జగన్ కు వ్యాపార వ్యక్తిగత అనుబంధాలున్నాయని అంటారు. జగన్ జైలులో వున్నపుడు, మ్యాట్రక్స్ ప్రసాద్ ను పలుమార్లు నాగార్జున కలిసివచ్చారు. అన్నట్లు ఇప్పుడు నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరులకు మీడియా పార్టనర్ జగన్ సాక్షి పత్రికే. గెలిచిన చంద్రబాబును కలిసేందుకు అందరూ వెళ్లి వస్తున్నారు. మరి నాగ్ ఎప్పుడు వెళ్తాడో?