వర్మ…ఫారిన్ టూర్

ఎవరైనా తమ సినిమాలను కొంతయినా విదేశాల్లో తీయాలనుకుంటారేమో కానీ, రామ్ గోపాల్ వర్మ మాత్రం తను వున్న చోట, పాతిక ముఫై కిలోమీటర్ల రేడియస్ లోనే తీసేస్తాడు. అది హిందీ సినిమా కావచ్చు..తెలుగు సినిమా…

ఎవరైనా తమ సినిమాలను కొంతయినా విదేశాల్లో తీయాలనుకుంటారేమో కానీ, రామ్ గోపాల్ వర్మ మాత్రం తను వున్న చోట, పాతిక ముఫై కిలోమీటర్ల రేడియస్ లోనే తీసేస్తాడు. అది హిందీ సినిమా కావచ్చు..తెలుగు సినిమా కావచ్చు. 

అంతే కాదు, కొంత కాలంగా వర్మ బడ్జెట్ పరంగా పావలా, అర్థరూపాయి సినిమాలు చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు చాలా భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నాడు. దీని టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావచ్చింది. సచిన్ జోషి, మీరా చోప్రా తదితరులతో తెలుగు-హిందీల్లో తీస్తున్న ఈ సినిమా పేరు అఫైర్. దాదాపు ముఫై కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు వినికిడి.

ఇప్పుడు ఈ సినిమా పాటలు, కొన్ని సీన్ల కోసం వర్మ పోలెండ్ ను ఎంచుకున్నాడు. ఎప్పుడో నితిన్ తో అడవి సినిమా కోసం దట్టమైన అడవులున్న శ్రీలంకకు వెళ్లాడు. మళ్లీ ఇదిగో ఇప్పుడు ఇలా. ఈ సినిమాకు సచిన్ జోషినే నిర్మాత.