లాటా అద్వర్యంలో సంక్రాంతి మేళా

శనివారం లాస్ ఏంజిలెస్ తెలుగు అసోసియేషన్ అద్వర్యంలో సంక్రాంతి మేళా  వినోద భరితంగా జరిగింది ఈ కార్యక్రమంలో 1900 మంది కి పైగా లాస్ అంజిలేస్ ప్రాంత తెలుగు వారు పాల్గొన్నారు. లాటా  ఆద్వర్యంలో…

శనివారం లాస్ ఏంజిలెస్ తెలుగు అసోసియేషన్ అద్వర్యంలో సంక్రాంతి మేళా  వినోద భరితంగా జరిగింది ఈ కార్యక్రమంలో 1900 మంది కి పైగా లాస్ అంజిలేస్ ప్రాంత తెలుగు వారు పాల్గొన్నారు. లాటా  ఆద్వర్యంలో రెండవ సరి సంక్రంతిని కనుల పండుగగా జరుపుకున్నరు.  ఈ కార్యక్రమలో పలు జానపద రీతులు ప్రేక్షకులను అలరించాయి. జానపద నృత్య రీతులైన కోలాటమును  మహిళలు మరియు ఇతర లాటా సభ్యులచే ప్రదర్శించారు.  చిన్నారులు ప్రదర్శించిన జడ కోలాటము చూపరులను విశేషంగా ఆకర్షించింది. లాటా  ప్రధాన వినోద కర్య్క్రమమిన ఫ్లాష్ మోబ్ ఈ సారి కూడా ప్రదర్శించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో రికార్డింగ్ డాన్సెస్ ప్రలువురిని ఆకర్షించాయి.  ఈ కార్యక్రమానికి  సమీర్ భావనిభట్ల, శ్రీకాంత్ కోచార్లకోట  వాఖ్యాతలు గ వ్యవహరించారు. 150 మంది పైగా లాస్ ఏంజిలెస్ తెలుగు వారు ఐదు గంటల పటు జరిగిన వినోద కార్యక్రమాలలో పాల్గొన్నారు. 

సుమారు 110 మంది లాటా స్వచ్చంద కార్యకర్తలు రెండు నెలలకు పైగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇతోధికంగా సహాయము అందించారు.  లాటా ఈ మేళా  లో తిరునాళ్ళను మరిపించేలా పిల్లల్లా కు ప్రత్యేక స్టాల్స్ ను నిర్వహించరు. ఈ స్టాల్స్ ను 10 నుండి 12 లో పు పిల్లలు శ్రీహరి అట్లూరి గారి అధ్వర్యంలో నిర్వహించారు.  లాటా ప్రెసిడెంట్ రమేష్ కోటమూర్తి LATA young achievement  పురస్కార గ్రహీత లైన అఖిల కీతిరెడ్డి (మిస్ యు. ఎస్. ఏ రన్నర్అప్  )మరియు అద్వైత్ కార్తీక జాతీయ రాకెట్ బాల్ ఛాంపియన్ అండర్ 8 లను సత్కారించారు.

చివరగా నవీన్ కాంత్ భాయి మరియు కృష్ణ సామంతుల గార్ల టీం లు చేసిన నృత్యాలు సభ ను ఉర్రూతలూ గించాయి. మేళా కు విచ్చేసిన అతిధులకు, అరిసెలు, పూత రేకుల తో రుచికరమైన  విందు భోజనాన్ని అందించారు. 

ఈ సందర్భంగా లాటా ప్రెసిడెంట్ రమేష్ కోటమూర్తి లాటా  కి ముగ్గురు నూతన బోర్డు సభ్యులు శ్రీహరి అట్లూరి , సురేష్ అయినంపూడి, విజయ భాస్కర్ నెక్కంటి ల ను సభకు పరిచయం చెసారు. లాటా  కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ కొమిరిసేట్టి, రవి తిరువైపాటి, హరి మాదాల, తిలక్ కడియాల మరియు లక్ష్మి చిమట గార్లు ఈ మేళా  జయప్రదం కావడానికి సహకరించిన కార్య కర్తలకు  మరియు విచ్చేసిన అతిదులకు  తమ ధన్య వాదాలను తెలియ చేసారు. చివరగా కార్యక్రమాన్ని భారతీయ అమరియు అమెరికన్ జాతీయ గీతాలతో ముగించారు