ముద్దు సన్నివేశాలకు నేను దూరం

ప్రేమలో ముద్దు ముచ్చట్లు లేకుండా వుండవు కదా. అందుకే మన దర్శకులు ఎక్కడో ఓ చోట ముద్దు సీను ఇరికించాలని చూస్తారు. అయితే ఎంగిలి ముద్దు సన్నివేశాలకు నేనస్సలు ఒప్పుకోనంటోంది సెక్సీ సుందరి హన్సిక. …

ప్రేమలో ముద్దు ముచ్చట్లు లేకుండా వుండవు కదా. అందుకే మన దర్శకులు ఎక్కడో ఓ చోట ముద్దు సీను ఇరికించాలని చూస్తారు. అయితే ఎంగిలి ముద్దు సన్నివేశాలకు నేనస్సలు ఒప్పుకోనంటోంది సెక్సీ సుందరి హన్సిక. 

హద్దులోనే ప్రేమ సన్నివేశాలుండాలి తప్ప శృంగారాన్ని పురికొల్పేలా ముద్దులు వుండకూడదని కూడా చెబుతుంది. ముద్దు అనేది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదని చెబుతున్న హన్సిక ఓ హెల్త్‌ మాగజైన్‌లో ముద్దు ద్వారా వచ్చే విపత్తులేమిటో చదివిందట. 

అమ్మాయి, అబ్బాయి ముద్దు పెట్టుకోవడం వల్ల లక్షలాది బాక్టీరియా లాలాజలం ద్వారా అటూ ఇటూ ట్రాన్స్‌ఫర్‌ అవుతాయట. అవి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో హాని చెయ్య మానవట. స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజా, ఎబోలా లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ముద్దు ద్వారా వచ్చేస్తాయట. 

సైన్స్‌ సంగతి సరే, రేపు పెళ్ళయితే భర్తకు కూడా ముద్దులు ఇస్తుందో లేదో అని మనకు డౌట్స్‌ రావడం సహజం. అడిగితే హన్సిక ఏమనుకుంటుందో.?