‘పొలిటీషియన్‌కన్నా లాయర్‌నే నమ్ముతాను..’

‘‘రాజకీయ నాయకుల్ని నమ్ముకోవడం వేస్ట్.. పైగా అలాంటివారి సహకారం తీసుకుంటే మనకున్న ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది.. అందుకే పొలిటీషియన్స్‌కంటే లాయర్స్ బెటర్.. నేను నా లాయర్ల బృందాన్నే నమ్మతాను.. తద్వారా నా నిజాయితీని నేను…

‘‘రాజకీయ నాయకుల్ని నమ్ముకోవడం వేస్ట్.. పైగా అలాంటివారి సహకారం తీసుకుంటే మనకున్న ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది.. అందుకే పొలిటీషియన్స్‌కంటే లాయర్స్ బెటర్.. నేను నా లాయర్ల బృందాన్నే నమ్మతాను.. తద్వారా నా నిజాయితీని నేను నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది..’’ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ మనుసులో మాట ఇది. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులోనూ, ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడన్న కేసులోనూ సల్మాన్‌ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ కేసులకు సంబంధించి సల్మాన్‌ఖాన్ గతంలో జైలుకెళ్ళొచ్చాడు కూడా. ఆ కేసులు ఇంకా అతన్ని వెంటాడుతూనే వున్నాయి. వాటి గురించి ప్రస్తావిస్తే.. పై విధంగా స్పందించాడు సల్మాన్‌ఖాన్. రాజకీయాల గురించీ, సినిమాల గురించీ, వ్యక్తిగత జీవితం గురించీ సల్మాన్‌ఖాన్ ఏమంటున్నాడంటే…

వ్యవస్థనే అవినీతిమయం చేసేశారు

‘రాజకీయాల్ని తప పట్టను కానీ, రాజకీయ వ్యవస్థను అవినీతితో నింపేశారు కొందరు రాజకీయ నాయకులు. అక్కడా ఇక్కడా అన్న తేడానే లేదు, అన్ని చోట్లా అవినీతి వుంది. అవినీతి మన సంస్కృతిలో భాగమైపోయినందుకు చాలా బాధగా వుంది. ఎవరో ఒకరు వచ్చి ఈ వ్యవస్థను బాగు చేస్తే బావుండునన్పిస్తుంది. కానీ, అలా వస్తున్నవారూ ప్రజలకు ఎన్నికల ముందు భరోసా ఇస్తారే తప్ప, ఎన్నికలయ్యాక మాట మీద నిలబడరు. అందుకే వ్యవస్థని మార్చేస్తాం అని ఎవరు చెప్పినా అంత తేలికగా నమ్మను. అయితే వ్యవస్థ మారాలని మాత్రం కోరుకుంటాను. అవినీతి రహిత భారతదేశాన్ని చూడాలనుకుంటాను..’ అంటూ ఉద్వేగంగా మాట్లాడాడు సల్మాన్‌ఖాన్.

ఆమ్ ఆద్మీ పార్టీ  అరవింద్ కేజ్రీవాల్ గురించి..

దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ, వ్యవస్థలోని అవినీతిని పారద్రోలగలిగితే ఆ పార్టీని అభినందిస్తానన్న సల్మాన్‌ఖాన్, ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీకి అవకాశం ఇచ్చారనీ, దాన్ని అరవింద్ కేజ్రీవాల్ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించాడు. కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేసి, అదే పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగించిందనీ, ఇలాంటి చర్యలతో ప్రజల్లోకి తపడు సంకేతాలు వెళతాయని తాను భావిస్తున్నట్లు సల్మాన్‌ఖాన్ చెప్పాడు. ‘అయితే అతనికి (అరవింద్ కేజ్రీవాల్) ఇపడే అవకాశం లభించింది, భవిష్యత్తులో ఏం చేస్తాడో ఇపడే చెప్పలేం కదా, మంచి చేయాలనే ఆశిద్దాం..’ అన్నాడు సల్మాన్‌ఖాన్. ముంబైకి ఏదో చేయాలని వుంటుంది, కానీ నేను చేయలేను.. అందుకే చేస్తున్నవాళ్ళకి చేతనైనంత వరకు మోరల్ సపోర్ట్ ఇస్తానని సల్మాన్ చెబుతున్నాడు.

మంచోళ్ళేక వివాదాలు ఎక్కువ

‘సమాజానికి మంచి చేద్దాం.. అనే ఆలోచన ఎవరున్నా వారి చుట్టూనే ఎక్కువగా వివాదాలు చేరిపోతాయి. సమాజం అలా వుంది.. మనం ఏమీ చేయలేం. నేనైనా, అరవింద్ కేజ్రీవాల్ అయినా.. ఇంకొకరైనా సమాజంలో పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోతే వివాదాలుండవు, సమాజంలో దేన్నయినా ప్రశ్నించదలచుకుంటే వివాదాలతో సావాసం చేయాల్సి వస్తుంది..’ అంటున్నాడు సల్మాన్‌ఖాన్.

మసాలా ఎందుకు వుండదూ.?

సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం ‘జయె’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన ‘స్టాలిన్’కి హిందీ రీమేక్. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. కానీ, ఇందులోనూ మసాలా వుంటుందంటున్నాడు సల్మాన్‌ఖాన్. కమర్షియల్ అంశాలు కలగలిసిన మంచి సినిమా ‘జయె’ అంటోన్న సల్మాన్‌ఖాన్, తెలుగు వెర్షన్ చాలా సార్లు చూశాననీ, అది తన మనసుకు బాగా నచ్చేయడంతోనే హిందీలోకి రీమేక్ చేస్తున్నానని చెప్పాడు. మార్పు మన నుంచే ప్రారంభం కావాలని చెప్పే సినిమా ఇది. ఒకరికి ఒకరు సహాయ పడటం, సమాజంలో అన్యాయాన్ని ఎదిరించాలనుకోవడం సినిమాలోని కీలక అంశాలని అవి తనకు బాగా నచ్చాయని అందుకే సినిమా చేస్తున్నానని సల్మాన్ వివరించాడు.

నేనెవరికీ గాడ్ ఫాదర్‌ని కాను

టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలనుకోవడం తప్పేమీ కాదనీ, ఎవరిలో అయినా టాలెంట్ వుంటే తాను ఎంకరేజ్ చేస్తాననీ, అంతే తప్ప, తాను పరిచయం చేసిన హీరోయిన్లకి తాను గాడ్ ఫాదర్ అవబోనని స్పష్టం చేశాడు సల్మాన్‌ఖాన్. టాలెంట్‌ని ఎంకరేజ్ చేసే విషయంలో తన ప్రవర్తన నచ్చి, తనకు స్నేహితురాళ్ళుగా మారినవారు చాలామందే వున్నారనీ, ఎవరితోనూ స్నేహం తప్ప ఇంకో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేయలేదని సల్మాన్ చెప్పాడు. అమ్మాయిల్లో కష్టపడేతత్వాన్ని తాను ఇష్టపడ్తాడట సల్మాన్‌ఖాన్.

టీఆర్పీ రేటింగులకి ఉపయోగపడ్తుందది

‘‘బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు, ఏమో నేనూ ఆ నరకంలోకి వెళ్ళాల్సి వస్తుందేమో.. ఓ సారి ఆ నరకం చవిచూశాను, మళ్ళీ అలాంటి అనుభవం కోరుకోవడంలేదు. కానీ, చట్టాలను గౌరవించాలి కదా. రాజకీయ నాయకుల్ని నమ్ముకోను, లాయర్స్ టీమ్‌ని నమ్ముకుంటాను.. వారి ద్వారా నా వాదనను బలంగా విన్పించుకుంటాను, తద్వారా నేను తప చేయలేదన్న విషయాన్ని కోర్టుకు విన్నవిస్తాను.. న్యాయస్థానం ఎలా నిర్ణయిస్తే అలా.. జైలుకు వెళ్ళాల్సి వచ్చినా, అలాక్కూడా టీఆర్పీ రేటింగులకు ఉపయోగపడ్తుందది..’’ అంటోన్న సల్మాన్‌ఖాన్, జైలుకెళ్ళొచ్చినా తానేంటో అందరికీ తెలుసనీ, తన ఇమేజ్ తగ్గదనీ చెబుతున్నాడు.