అందరూ నితిన్ తోనే?

హీరో నితిన్ ఇప్పుడు డైరక్టర్ల హాట్ ఫేవరెట్ గా మారాడు. ప్రతి ఒక్కరూ నితిన్ ఓకె అంటాడా అనే చూస్తున్నారు. ఈ జాబితా రాను రాను పెరుగుతోంది. మేర్లపాక గాంధీ, వీరభద్రమ్ చౌదరి, నందినీ…

హీరో నితిన్ ఇప్పుడు డైరక్టర్ల హాట్ ఫేవరెట్ గా మారాడు. ప్రతి ఒక్కరూ నితిన్ ఓకె అంటాడా అనే చూస్తున్నారు. ఈ జాబితా రాను రాను పెరుగుతోంది. మేర్లపాక గాంధీ, వీరభద్రమ్ చౌదరి, నందినీ రెడ్డి ఇలా మరి ఒకరిద్దరు ఈ వెయింటింగ్ జాబితాలో వున్నారు. 

నితిన్ ఎవరిని నో అనకుండా లైన్ చూడండి ముందు అంటున్నాడట. దాంతో నితిన్ తమకు ఓకె అనేసినట్లే అని ప్రతి ఒక్కరు సంబరపడిపోతున్నారు. కానీ లైన్ చెప్పాలి, దానికి నితిన్ ఓకె అనాలి. ఆపై స్క్రిప్ట్ రెడీ అవ్వాలి.  ఇలా మధ్యలో చాలా వ్యవహారాలున్నాయి మరి.