త్రిష ఇంత‌కు దిగ‌జారిందా??

స్టార్ హీరోల‌తో ఆడిపాడ‌న త్రిష ఇప్పుడు హాస్యన‌టుడు శ్రీ‌నివాస‌రెడ్డి సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తుందా..??  ఆ అవ‌కాశాలు ఉన్నాయంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. శ్రీ‌నివాస‌ర‌రెడ్డి క‌థానాయ‌కుడిగా పీవీపీ సంస్థ ఓ సినిమాని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు  చేస్తోంది. Advertisement…

స్టార్ హీరోల‌తో ఆడిపాడ‌న త్రిష ఇప్పుడు హాస్యన‌టుడు శ్రీ‌నివాస‌రెడ్డి సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తుందా..??  ఆ అవ‌కాశాలు ఉన్నాయంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. శ్రీ‌నివాస‌ర‌రెడ్డి క‌థానాయ‌కుడిగా పీవీపీ సంస్థ ఓ సినిమాని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు  చేస్తోంది.

 క‌థానాయిక‌గా ఓ స్టార్ హీరోయిన్ కావాల‌ట‌. ఆ స్థానంలో త్రిష పేరు ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమాలో న‌టించ‌డానికి త్రిష కూడా అంగీక‌రించింద‌ని స‌మాచార‌మ్‌!  త్రిష మ‌రీ ఏ సినిమా ప‌డితే ఆ సినిమా ఎలా ఒప్పేసుకొంటుంద‌బ్బా..??  అని ఫిల్మ్‌న‌గర్ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. 

అయితే పీవీపీ సంస్థ మాత్రం త్రిష‌ను ఈ సినిమాలో నటింప‌జేయ‌డానికి నానా పాట్లూ ప‌డ్డార‌ట‌. ఆఖ‌రికి త్రిష అడిగినంత పారితోషికం ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతున్నారు. మ‌రోవైపు త్రిష‌కు ఇప్పుడు అవ‌కాశం ద‌క్కడ‌మే… అదృష్టం. వ‌చ్చిన ఏ చిన్న సినిమానీ వ‌దులుకోకూడ‌ద‌ని డిసైడ్ అయిపోయింది. అందుకే ఈ సినిమాకి పచ్చజెండా ఊపింద‌ట‌.