మ‌హేషా..? మ‌జాకా??

సినిమా ప్రచారం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఇది వ‌రకు సినిమా విడుద‌ల‌కు ముందు… పాట‌ల విడుద‌ల కార్యక్రమం ఒక్కటే వైభ‌వంగా జ‌రిగేది. సినిమా వాళ్లకు తొలి పండగ అదే. ఇప్పుడు అలా కాదు. లోగో లాంచ్‌,…

సినిమా ప్రచారం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఇది వ‌రకు సినిమా విడుద‌ల‌కు ముందు… పాట‌ల విడుద‌ల కార్యక్రమం ఒక్కటే వైభ‌వంగా జ‌రిగేది. సినిమా వాళ్లకు తొలి పండగ అదే. ఇప్పుడు అలా కాదు. లోగో లాంచ్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌.. అంటూ ఎంత హ‌డావుడో. ప్రతీదీ ఓ మినీ పండ‌గ‌లానే చేస్తున్నారు. అందులో పాటల వేడుక కూడా ఒక‌టి. మ‌హా అయితే శిల్పారామంలో అభిమానుల స‌మక్షంలో పాట‌ల సీడీని విడుద‌ల చేసి… అయ్యింది అనిపిస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పాట‌ల విడుద‌ల కార్యక్రమం కూడా స‌రికొత్త రీతిలో చేయాల‌ని చూస్తున్నారు. 

`1` చిత్రబృందం ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నచిత్రం `1`. సుకుమార్ ద‌ర్శకుడు. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల‌ను డిసెంబ‌రు 14 న విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఈసారి పాట‌ల విడుద‌ల కార్యక్రమం హైద‌రాబాద్‌లో నిర్వహించ‌డం లేదు. అమెరికాలో చేస్తార‌ట‌. 

ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని శాటిలైట్ ద్వారా థియేట‌ర్లలో ప్రద‌ర్శిస్తార‌ట‌. అక్కడా టికెట్లు అమ్ముకొంటారు. అలా సినిమా చూపించ‌డానికి, పాట‌లు వినిపించ‌డానికి కూడా టికెట్లు పెట్టేశార‌న్నమాట‌. మ‌హేష్ బాబు సినిమానా?  మ‌జాకా?