ఎమ్బీయస్‌ :నందన్‌కు కాంగ్రెస్సే ఆధారం

ఇన్ఫోసిస్‌ సారథుల్లో ఒకడిగా యువత మన్నన లంది, ఆధార్‌ కార్డు రూపకల్పన ద్వారా దేశమంతా పరిచితుడైన నందన్‌ నీలేకని కాంగ్రెస్‌ అభ్యర్థిగా బెంగుళూరు సౌత్‌ నుండి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తారని అనుకుంటున్నారు.…

ఇన్ఫోసిస్‌ సారథుల్లో ఒకడిగా యువత మన్నన లంది, ఆధార్‌ కార్డు రూపకల్పన ద్వారా దేశమంతా పరిచితుడైన నందన్‌ నీలేకని కాంగ్రెస్‌ అభ్యర్థిగా బెంగుళూరు సౌత్‌ నుండి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తారని అనుకుంటున్నారు. నందన్‌ దీని గురించి యింకా ఏమీ మాట్లాడకపోయినా, రాజకీయాల్లోకి ఆసక్తి వున్నట్లు తన సన్నిహితుల దగ్గర వెల్లడించారట. 

విద్యావంతులు ఎక్కువగా వున్నారు కాబట్టి బెంగుళూరులో ఆయన గెలుపు సులభం అనుకోవడానికి లేదు. ఆ నియోజకవర్గంలో ఓట్లేయడానికి బద్ధకించేవారే ఎక్కువ. చవక విమానయానంతో అందర్నీ ఆకట్టుకున్న జి.ఆర్‌.గోపీనాథ్‌ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా అక్కణ్నుంచే పోటీ చేసి దెబ్బ తిన్నారు. బిజెపి జాతీయ స్థాయిలో జనరల్‌ సెక్రటరీగా వున్న అనంత్‌ కుమార్‌ నందన్‌తో తలపడవచ్చు. బెంగుళూరుకు వున్న ఐటీ జనాభా బట్టి, ఆ నియోజకవర్గంలో యువత ఎక్కువశాతం వున్నారు కాబట్టి నందన్‌ గెలిచినా గెలవవచ్చని అంచనా.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]