తోటి హీరోయిన్‌పై నయన ఆగ్రహం

మలయాళ సినీ నటి నజ్రియా నజీమ్‌ వివాదంలోకి నయనతార తలదూర్చింది. ఓ సినిమాలో తనను సంప్రదించకుండా కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించి, ఆ సన్నివేశంలో తాను వున్నట్లుగా చూపించారంటూ నజ్రియా నజీమ్‌ ఆరోపించడంతో, తమిళ సినీ…

మలయాళ సినీ నటి నజ్రియా నజీమ్‌ వివాదంలోకి నయనతార తలదూర్చింది. ఓ సినిమాలో తనను సంప్రదించకుండా కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించి, ఆ సన్నివేశంలో తాను వున్నట్లుగా చూపించారంటూ నజ్రియా నజీమ్‌ ఆరోపించడంతో, తమిళ సినీ పరిశ్రమని ఈ వివాదం ఓ కుదుపు కుదిపేసింది.

ధనుష్‌ హీరోగా వచ్చిన ‘నైయాండి’ సినిమాలోని సన్నివేశమే ఈ వివాదానికి కారణం. అయితే ఈ వివాదంపై నయనతార ఎందుకు స్పందించిందోగానీ, నజ్రియా ఓవరాక్షన్‌ చేస్తోందనీ, అనవసర రాద్ధాంతం చేయడం వల్ల కెరీర్‌ నాశనమైపోతుందనీ ఘాటుగా స్పందించడం నజ్రియా ` నయనతారల మధ్య వివాదంగా మారింది.

అనవసర విషయాల్లో నయన జోక్యం చేసుకోవడమేంటని ప్రశ్నించిన నజ్రియా, తనకు ఇష్టం లేని విషయాలపై తనకు నిరసన తెలిపే హక్కు వుందనీ, ఈ విషయంలో నయనతార జోక్యం అర్థరహితమనీ కౌంటర్‌ ఇచ్చింది.

కెరీర్‌లో దూసుకెళ్ళాలంటే కొన్ని కొన్ని విషయాలు పట్టించుకోకూడదనీ, సాటి నటిగానే నజ్రియా విషయంపై స్పందించానని నయనతార చెబుతోంది. అయినా, కెలుక్కుని మరీ నజ్రియాతో వివాదం కొని తెచ్చుకోవడం తమిళ సినీ జనాన్ని ఆశ్చర్యపరుస్తోంది. పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే నయనతార ఓవర్‌గా స్పందించి వుండొచ్చని తమిళ సినీ జనం అనుకుంటున్నారు.
అన్నట్టు, నజ్రియా జూ.ఎన్టీఆర్‌తో ఓ సినిమాలో నటించబోతోందని ఆ మధ్య వార్తలొచ్చాయి. మలయాళ సినీ పరిశ్రమలో సంచలన తారగా పలు విజయాలు అందుకున్న నజ్రియా ఇప్పుడిప్పుడే తమిళ సినిమాల్లోనూ మంచి పేరు తెచ్చుకుంటోంది.