ఆఫర్‌ వదులుకొన్న సుకుమార్‌

బాలీవుడ్‌లో ఛాన్సంటే ఎగిరి గంతేస్తారు..?  పిలవ్వంగానే రెక్కలు కట్టుకొని వాలిపోతారు. అదో మగద్భాగ్యం అన్నట్టు. అయితే అలాంటి అపురూపమైన అవకాశాన్ని వదులుకొన్నాడు సుకుమార్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ఆర్య 2. ఈ సినిమాని…

బాలీవుడ్‌లో ఛాన్సంటే ఎగిరి గంతేస్తారు..?  పిలవ్వంగానే రెక్కలు కట్టుకొని వాలిపోతారు. అదో మగద్భాగ్యం అన్నట్టు. అయితే అలాంటి అపురూపమైన అవకాశాన్ని వదులుకొన్నాడు సుకుమార్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ఆర్య 2. ఈ సినిమాని బాలీవుడ్‌ లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించమని సుకుమార్‌ని అడిగారట. 

కానీ.. ఈ ఆఫర్‌ని వద్దనుకొన్నాడు సుక్కు. కారణం..మహేష్‌ బాబు ‘1 ’ సినిమా పనుల్లో తీరక లేకుండా ఉండడమే. అంతేకాదు.. ఎన్టీఆర్‌ కోసం కూడా ఓ కథ రెడీ చేసుకొంటున్నాడట. ఈలోగా అక్కడకి వెళ్లి ఏం ఉద్ధరించాలని.. ఆ సినిమా పక్కన పెట్టాడు.

 పైగా ఆర్య 2 ఇక్కడ బోల్తా పడిన కథ. బాలీవుడ్‌లో గ్యారెంటీగా ఆడేస్తుందన్న నమ్మకం లేదు. అలాంటి కథతో మళ్లీ రిస్క్‌ చేయడం ఎందుకు.. అనేది సుక్కు ఆలోచన కావచ్చు.