వినాయక్‌తో ఎన్టీఆర్‌

రామయ్యా వస్తావయ్యా పరాజయంతో డీలా పడ్డ ఎన్టీఆర్‌ తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని తాపత్రయపడుతున్నాడు. తన ఇమేజ్‌ని కరెక్ట్‌గా స్టడీ చేసి తనకి ఆది, అదుర్స్‌ వంటి హిట్స్‌ ఇచ్చిన వినాయక్‌తో త్వరలోనే ఓ…

రామయ్యా వస్తావయ్యా పరాజయంతో డీలా పడ్డ ఎన్టీఆర్‌ తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని తాపత్రయపడుతున్నాడు. తన ఇమేజ్‌ని కరెక్ట్‌గా స్టడీ చేసి తనకి ఆది, అదుర్స్‌ వంటి హిట్స్‌ ఇచ్చిన వినాయక్‌తో త్వరలోనే ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్‌ డిసైడ్‌ అయ్యాడు. అయితే ఇది అదుర్స్‌కి సీక్వెలా కాదా అనేది ఇంకా తెలీలేదు. 

ప్రస్తుతం ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో నటిస్తున్న ఎన్టీఆర్‌ సమ్మర్‌ తర్వాత తన తదుపరి చిత్రం మొదలు పెడతాడు. ఇది ఎవరి డైరెక్షన్‌లో ఉంటుందనేది ఇంకా స్పష్టం కాలేదు. త్రివిక్రమ్‌, కొరటాల శివతో ఎన్టీఆర్‌ సినిమాలకి టాక్స్‌ జరుగుతున్నాయి. అయితే తన కెరీర్‌ స్లంప్‌లో ఉండడంతో ఎన్టీఆర్‌ ఇప్పుడు హిట్లు కోరుకుంటున్నాడు. 

వినాయక్‌ అయితే సక్సెస్‌ గ్యారెంటీ ఎక్కువ కాబట్టి ఎన్టీఆర్‌ అతడి దర్శకత్వంలో చేయాలని అనుకుంటున్నట్టున్నాడు. వినాయక్‌ ఈమధ్య తీసిన అదుర్స్‌, నాయక్‌లానే ఈ చిత్రం కూడా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అట. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్‌ తనయుడిని హీరోగా పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్న వినాయక్‌ అది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌ సినిమా సబ్జెక్ట్‌పై దృష్టి పెడతాడు.