‘అత్తారింటికి దారేది’ చిత్రానికి 70 కోట్లకి పైగా షేర్ రావడంతో, పెరిగిన టికెట్ ధరలతో హిట్ టాక్ వచ్చిన స్టార్ హీరోల సినిమాలు ఈ మార్కుని చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అలా అయితే మహేష్ తదుపరి చిత్రం ‘నేనొక్కడినే’కి హిట్ టాక్ వస్తే 70 కోట్ల షేర్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
ఇంతకు ఎంత తక్కువ వచ్చినా కానీ ఈ చిత్ర నిర్మాతలు సేఫ్ అవరనేది ఇండస్ట్రీ టాక్. హై క్వాలిటీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో, విదేశీ నిపుణులతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పెట్టుబడి అరవై అయిదు నుంచి డెభ్భై కోట్ల వరకు అవుతోందట. ఈ చిత్ర నిర్మాతలు ఖర్చు పెట్టింది తిరిగి రావాలంటే తప్పకుండా ఈ చిత్రం సెవెంటీ క్రోర్స్ క్లబ్‌లో చేరాలట.
ఇంతవరకు మగధీర, అత్తారింటికి దారేది మినహా మరే సినిమా ఈ ఫీట్ సాధించలేదు. నేనొక్కడినేతో మహేష్ కూడా ఆ మార్కు దాటాలంటే దీనికి తప్పకుండా బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చి తీరాలి. సుకుమార్ తమకి బ్లాక్‌బస్టర్ ఇస్తాడనే నమ్మకంతోనే నిర్మాతలు వెనకా ముందు ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తున్నారు. ‘1’ నంబర్‌వన్ సినిమాగా నిలిస్తే తప్ప వారు కొద్దో గొప్పో లాభాలు చవిచూసే అవకాశం లేదు.