ఈమధ్య తన సినిమాల్ని చాలా వేగంగా పూర్తి చేసేస్తున్న పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’ చిత్రానికి కూడా డెడ్‌లైన్ విధించాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో మొదలు పెట్టి ఏప్రిల్‌లోగా సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని దర్శకుడు సంపత్ నందికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ‘అత్తారింటికి దారేది’ పూర్తయిన దగ్గర్నుంచి ‘గబ్బర్‌సింగ్ 2’ స్క్రిప్ట్‌పై పవన్ స్వయంగా వర్క్ చేస్తున్నాడు.
స్క్రిప్ట్ అతనికి సంతృప్తికరంగా తయారయ్యే సరికి వేగంగా పూర్తి చేసి మే రెండో వారంలో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘గబ్బర్‌సింగ్’ కూడా అదే సమయంలో వచ్చింది కాబట్టి ఈ చిత్రాన్ని కూడా ఆ టైమ్‌లో రిలీజ్ చేస్తున్నాడు. సంపత్‌నంది తీసిన సూపర్‌హిట్ ‘రచ్చ’ కూడా సమ్మర్లోనే రిలీజ్ అయింది.
గబ్బర్‌సింగ్ క్యారెక్టరైజేషన్ యథాతథంగా ఉంచి, కథాపరంగా ఇందులో కాస్త సీరియస్‌నెస్ యాడ్ చేశారట. గబ్బర్‌సింగ్ 2 స్క్రిప్ట్ మొదటి దాని కంటే చాలా బాగుంటుందని, అలా అని వినోదం మిస్ అవదని చెబుతున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు రాయవచ్చునని కూడా వినిపిస్తోంది.