తమన్నా బాలీవుడ్‌ కబుర్లు

తమన్నా ఏమైపోయింది.? అని తెలుగు సినీ పరిశ్రమ ఆమె గురించి తలచుకోగానే, ఆమె మహేష్‌ సరసన ‘ఆగడు’ సినిమాలో నటిస్తోందన్న వార్త బయటకొచ్చింది. ‘తడాఖా’ తర్వాత తమన్నా కెరీర్‌ అటకెక్కిందనుకున్నారంతా. ఆ సినిమా హిట్టయినా,…

తమన్నా ఏమైపోయింది.? అని తెలుగు సినీ పరిశ్రమ ఆమె గురించి తలచుకోగానే, ఆమె మహేష్‌ సరసన ‘ఆగడు’ సినిమాలో నటిస్తోందన్న వార్త బయటకొచ్చింది. ‘తడాఖా’ తర్వాత తమన్నా కెరీర్‌ అటకెక్కిందనుకున్నారంతా. ఆ సినిమా హిట్టయినా, తమన్నా ఎందుకో మళ్ళీ తెలుగులో అవకాశాలు పెద్దగా సంపాదించుకోలేకపోయింది.

ఎలాగైతేనేం మహేష్‌తో ఛాన్స్‌ అనగానే.. తమన్నా కెరీర్‌ మళ్ళీ ఊపందుకుందనే అనుకోవాలి. ఇదిలా వుంటే, హిందీలో ప్రస్తుతం తమన్నా రెండు సినిమాలు చేస్తోంది. తమిళంలో ఓ సినిమాలో నటిస్తోందిప్పుడు తమన్నా. సౌత్‌ సినిమాలకన్నా, తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలపైనే ఆసక్తితో వుంది.

‘హిమ్మత్‌వాలా’ నిరాశపర్చినా బాలీవుడ్‌లో తనకు ఆ సినిమా మంచి బిగినింగ్‌ ఇచ్చిందని తమన్నా సంతోషం వ్యక్తం చేస్తోంది. సౌత్‌ సినిమాలతో పోల్చితే బాలీవుడ్‌ సినిమాల్లో నటించడం వల్ల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని తమన్నా అభిప్రాయపడిరది. హిందీలో నటిస్తే, ఆ సినిమా ఎలాగూ అన్ని ప్రాంతాల్లోనూ విడుదలవుతుందనీ, అలా అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్నీ పలకరించవచ్చనీ తమన్నా చెప్పుకొచ్చింది.

తానేమీ సౌత్‌కి దూరం కాలేదనీ, బాలీవుడ్‌ ప్రాజెక్టులతో బిజీగా వుండడం వల్లే సౌత్‌కి తగినంత సమయం కేటాయించలేకపోతున్నానని అంటోంది తమన్నా. బాలీవుడ్‌కి వెళ్ళాక తమన్నా మరింత మాటకారి అయిపోయింది కదూ.!